పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆఫర్ తో ఊహించని అదృష్టాన్ని అందుకున్న డాలీ పవన్ లేటెస్ట్ మూవీలో చాల మార్పులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈసినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ప్రచారంలో ఉన్న పవన్ లుక్ ను పూర్తిగా మార్చివేయాలని డాలీ డిసైడ్ అయినట్లు టాక్. అంతేకాదు ఈసినిమాలో పవన్ ఎలా ఉంటే బాగుంటుందో తన ఊహలోనిరూపాన్ని నాలుగు అయిదు స్కెచ్ లు తయారుచేసి డాలీ పవన్ అభిప్రాయo గురించి ఎదురు చూస్తున్నట్లు టాక్. 

ఇది ఇలా ఉండగా ఈసినిమాకు ఇప్పటి వరకు ఒక లైన్ అనుకున్నారు కాని ఒక పక్కా స్క్రిప్ట్ పూర్తిగా తయారు కాకపోవడం దర్శకుడు డాలీకి షాక్ ఇచ్చినట్లు టాక్. దీనితో ఈ సినిమాకు సంబంధించిన స్క్రీన్ ప్లే దగ్గర నుంచి డైలాగ్స్ పోర్షన్ వరకు డాలీ పూర్తిగా కొత్తగా తయారు చేయవలసి వస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. రచయిత ఆకుల శివ టీమ్ ను రంగంలోకి దింపినా పనులు అంత వేగంగా జరగడం లేదు అన్న వార్తలు వస్తున్నాయి.

డీనికితోడు ప్రతి చిన్న విషయానికి డాలీ పవన్ అంగీకారం తీసుకోవలసిన నేపధ్యంలో డాలీకి ఈ మూవీ ప్రాజెక్ట్ విషయంలో అనుకొని సమస్యలు ఏర్పడుతున్నాయని ఫిలింనగర్ గాసిప్. ఈ వార్తలు ఇలా ఉండగా ఈ మూవీ తరువాత సెట్స్ పైకి రావలసిన పవన్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ల సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ అత్యంత వేగంగా జరుగుతోంది అన్న వార్తలు వస్తున్నాయి.

అంతేకాదు త్రివిక్రమ్ ఈసినిమాకు ‘దేవుడే దిగివచ్చినా’ అన్న టైటిల్ ను ఆలోచించి ఈ టైటిల్ ఫైనల్ చేయడానికి పవన్ నిర్ణయం గురించి ఎదురు చూస్తున్నట్లు టాక్. దీనితో పవన్ తాను నటించ వలసిన డాలీ సినిమా స్క్రిప్ట్ కంటే వేగంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రిప్ట్ పూర్తి అవుతూ ఉండటం గమనించి ఆనంద పడుతూ ఉన్నా ముందుగా పూర్తి చేయవలసిన డాలి సినిమా స్క్రిప్ట్ పనులు ఇంకా వేగం అందుకొక పోవడంతో డాలీ పై పవన్ తన ఒత్తిడి పెంచుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో త్రివిక్రమ్ స్పీడ్ ముందు డాలీ నిలబడ గలడా అంటూ సెటైర్లు పడటమే కాకుండా చివరి నిముషంలో డాలీ సినిమాకన్నా ముందుగా త్రివిక్రమ్ సినిమా మొదలవుతుందా అంటూ కామెంట్స్ చేసుకుంటున్నారు..   


మరింత సమాచారం తెలుసుకోండి: