తెలుగు ఇండస్ట్రీలోకి ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ నుంచి హీరోలు మాత్రమే ఎంట్రీ ఇస్తున్న తరుణంలో మొట్ట మొదటి సారిగా మెగా బ్రదర్ నాగబాబు కూతురు కొణిదెల నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది.  చిన్నప్పటి నుంచి సినిమా నేపథ్యంలో పుట్టి పెరిగిన నిహారిక సినిమాలంటే చిన్నతనం నుంచి విపరీతమైన ఇష్టంతో పెరిగింది..అందుకే మొదట షార్ట్ ఫిల్మ్ లో నటించి తర్వాత బుల్లితెరపై ‘ఢీ’ డ్యాన్స్ షో లో యాంకర్ గా తన సత్తా చాటింది. ఇప్పటికే నిహారిక అంటే తెలుగు ప్రేక్షకులు బాగా ఇష్ట పడుతున్నారు. ఇక సినిమాల్లో నటించాలన్న కోరిక మొదట తండ్రితో తెలుపగా ఆయన కాస్త వెనుకా ముందు ఆలోచించారట..ఎందుకంటే ఇప్పటి వరకు హీరోలకు మాత్రమే వస్తున్న నేపథ్యంలో హీరోయిన్ అంటే బాగుంటుందా అన్న మీమంసలో ఉండగా తెలుగు తెరపై వారుసురాలు ఎందుకు రాకూడదు అన్న ప్రశ్నించిందట..అందే ఇక హీరోయిన్ గా నటించేందుకు ఓకే చెప్పాడట నాగబాబు ఇది స్వయంగా ఆయనే ఒక మనసు ఆడియో ఫంక్షన్లో తెలిపారు.

అయితే మొదట మెగా ఫ్యామిలీ కూడా నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడంపై సుముఖత తెలపలేదు..తర్వాత ఒకే చెప్పడంతో ‘ఒక మనసు’ చిత్రంలో హీరోయిన్ గా ఎంట్రి ఇచ్చింది. అయితే ఈ చిత్రం ఆడియో వేడుకు గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఈ రోజు ఒక మనసు చిత్రం విడుదలైంది. ఇప్పటికే ఈ చిత్రంపై విపరీతమైన అంచనాలు చోటు చేసుకున్నాయి. అసలే మెగా వారి అమ్మాయి..మొదటి సినిమా ఏ రేంజ్ లో ఉంటుందా అని మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

మరోవైపు సినిమా నిహారిక చాలా సహజంగా నటించిందట..మంచి అనుభవం ఉన్న హీరోయిన్ గా నటించిందని టాక్. పూర్తి లవ్, పొలిటికల్ డ్రామా అయిన ఈ చిత్రం మంచి స్పందన వస్తుందా..లేదా అనేది రివ్యూలను బట్టి కొద్ది సేపట్లో తెలిసిపోతుంది. అయితే నిహారిక మాత్రం ఈ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మంచి సాహసమే చేసిందని ముందు ముందు మంచి సినిమాల్లో నటిస్తూ మెగా ఫ్యామిలీకి మంచి పేరు తీసుకు వస్తుందని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: