మొన్నటి దాకా కోల్పోయిన ఫార్మ్ ని ' నేను శైలజ ' తో తిరిగి తెచ్చుకున్నాడు హీరో రామ్. మంచి పాజిటివ్ ఎనర్జీ తో కొత్త సినిమా ని మొదలు పెట్టిన రామ్ కాస్త లేట్ గా మొదలు పెట్టినా మంచి స్క్రిప్ట్ తో సెట్స్ మీదకి వెళ్లాను అనే కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు.కందిరీగ డైరెక్టర్ సంతోష్ ఇచ్చిన  సబ్జెక్ట్ నచ్చడం తో టైం కూడా తీస్కోకుండా ఓకే చెప్పిన రామ్ కొన్ని కొన్ని మార్పులు మాత్రం కంపల్సరీ కావాలి అని కోరాడు.

 

ఈ సినిమా షూటింగ్ అప్పుడే సగం పైగా పూర్తయ్యింది అంటున్నారు. తరవాత సినిమా కూడా పెద్ద డైరెక్టర్ తో ఓకే చేయించుకున్న రామ్ తన అభిమానులకి సూపర్ న్యూస్ నే ఇచ్చాడు. ఇక మీద సినిమాలు ఎంచుకునే విషయం లో కంటే డైరెక్టర్ లని ఎంచుకునే విషయం లో చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నిస్తున్న రామ్ అనిల్ రావిపూడి తో సినిమాకి సంతకం పెట్టాడు.

 

'నా 15వ సినిమాని అనిల్ రావిపూడితో చేస్తున్నానని అనౌన్స్ చేయడానికి సంతోషిస్తున్నా. ఇది చాలా స్పెషల్. బ్లైండ్ అయినా కమర్షియల్.' అని ట్వీట్ పెట్టాడు మనోడు. బ్లైండ్ అంటూ రామ్ చెప్పిన మ్యాటర్ ఎవరికీ అర్ధం కాలేదు అయితే కొద్ది సేపటికి డైరెక్టర్ అనిల్ రావి పూడి తన ట్విట్టర్ ఖాతా ద్వరా ఈ సందేహాన్ని తీర్చేసారు. 'నా నెక్ట్స్ ఫిలింలో హీరో గుడ్డివాడు. కొత్తగా ట్రై చేస్తున్నా కమర్షియల్ ఎలిమెంట్స్ ఏ మాత్రం మిస్ కావు' అని చెప్పుకొచ్చాడు.

 

రామ్ ని మెచ్చుకోవాలి :

 

కమర్షియల్ సినిమాలో హీరో గుడ్డివాడు అంటే ఎలా యాక్సెప్ట్ చేస్తారో అని ఆలోచిస్తారు హీరోలు కానీ రామ్ మాత్రం వెంటనే ఓకే చెప్పేసి సంతకం పెట్టేసాడు అంటే అనిల్ ఇచ్చిన స్క్రిప్ట్ అంత పక్కగా ఉంది అని విశ్లేషకులు భావిస్తున్నారు. హీరో గుడ్డివాడు గా చేసిన ప్రతీ ప్రయోగాత్మక చిత్రం సెంటిమెంట్ బేస్ గా , హీరో పాత్ర స్టార్ హీరో చెయ్యలేనిది గా వెళుతుంది కానీ రామ్ తన మూస లోంచి బయటకి వచ్చి కళ్ళు లేని వ్యక్తి క్యారెక్టర్ చేస్తూ కూడా కమర్షియల్ పంథా మిస్ అవను అంటున్నాడు అంటే ఇది తెలుగు సినిమాలోనే అతి పెద్ద ప్రయోగం అని ఖచ్చితంగా చెప్పాలి.

స్టార్ హీరో కాకపోయినా రామ్ కి మంచి ఫాలోయింగ్ ఉంది, ముఖ్యంగా ఫ్యామిలీ లూ అమ్మాయిలూ రామ్ కి ప్రిఫరెన్స్ ఇస్తారు. సరైన సినిమా చేస్తే ఓపెనింగ్ ల సంగతి పక్కన పెడితే వారాంతం లో టికెట్ లు దొరకని హీరో ఇతను. కానీ ఫార్మ్ కోల్పోయి పూర్ స్క్రిప్ట్ లు సంతకం పెట్టడం తో ఇలా అయ్యింది పరిస్థితి. సో ఈ సారి ఈ ప్రయోగం తో ఆకట్టుకుంటాడు ఏమో చూద్దాం. ఏదేమైనా అసలు ఇలాంటి స్క్రిప్ట్ కి ఓకే చెప్పడమే చాలా గొప్ప విషయం కదా ?


మరింత సమాచారం తెలుసుకోండి: