మెగాహీరోయిన్ నిహారిక మొదటి సారిగా హీరోయిన్ గా చేసిన మూవీ నేడు థియోటర్స్ లో రిలీజ్ అయింది. అయితే ఈమూవీ బ్లాక్ బస్టర్ అవుతుందా? ప్లాప్ అవుతుందా? అనేదానిపై ఎవ్వరికీ క్యూరియాసిటి లేదు. ఉన్నదంతా ఒక్కటే. ఒకమనస్సు మూవీలో నిహారికా ఏ విధంగా నటించింది? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? ఇదే అందరిలోనూ కలిగే క్వశ్ఛన్స్. సినిమా చూస్తున్నంత సేపు ప్రతి ప్రేక్షకుడు నిహారికా నటనని నిశితంగా పరిశీలిస్తూనే ఉన్నారు.

అయితే నిహారికా సరసన నటించిన నాగశౌర్య ఈ సినిమాలో గత చిత్రాల కంటే కొంత బాగా నటించాడంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇక నిహారిక సైతం పర్వాలేదనిపించే విధంగా నటించింది. అయితే క్లోజప్ షాట్స్ కి తను లుక్స్ ని బాగా ఇచ్చినప్పటికీ, పూర్తి స్థాయిలో సరిగా నటించలేకపోయిందంటూ క్రిటిక్స్ కామెంట్స్ ఇచ్చేశారు.

అయితే అప్ కమింగ్ మూవీలలో నిహారికా తన నటనని ఇంప్రూవ్ చేసుకుంటే మంచిదని అంటున్నారు. మొదటి మూవీ కాబట్టి ఎటువంటి డెబ్యూ స్టార్ కి అయినా ఈ తరహా యాక్టింగ్ కామన్ అని అంటున్నారు. మొత్తంగా తన మొదటి సినిమాతో నిహారిక నటనపై పూర్తి స్థాయి మార్కులు రాలేదనే చెప్పాలి.

ఇదిలా ఉంటే, ‘రామరాజు’ దర్శకత్వంలో వచ్చిన ‘ఒక మనసు’చిత్రం స్టోరీ పరంగా బాగున్నప్పటికీ. స్లో నెరేషన్ తో చేసిన సాగదీత ధోరణి ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే విధంగా ఉందని అంటున్నారు. మొత్తానికి మెగాఫ్యామిలీ సపోర్ట్ తో వచ్చిన నిహారిక, ఫుల్ కాన్ఫిడెంట్ తో చేసిన నటన పర్వాలేదనిపించిందని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: