కొన్నిరోజులుగా రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి పై హడావిడి చేస్తున్న పలుపుకార్లకు ఫైనల్ ట్విస్ట్ ఇస్తూ కోలీవుడ్  మీడియా ఒక ఆసక్తికర కధనాన్ని ప్రచురించింది అని వార్తలు వస్తున్నాయి. కోలీవుడ్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం రజనీకాంత్ కి ఈరోజు అమెరికాలోని  ఒక ప్రముఖ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరుగుతోందని గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి.

అయితే ఈ విషయాన్నీ  ఎక్కడ బయటకు రాకుండా చాలా రహస్యంగా ఆపరేషన్ జరుతున్నట్లు కోలీవుడ్ మీడియా టాక్. ఏది ఎలా ఉన్నా ర‌జ‌నీ ఆరోగ్యం కాస్త ఆందోళ‌న‌క‌రంగానే ఉన్న‌ట్టు చెన్నై టాక్‌. ర‌జ‌నీతో ప్ర‌స్తుతం ‘రోబో 2.0’ తెర‌కెక్కిస్తున్న టాప్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ఈ మధ్య రజనీకాంత్ అమెరికాకు వెళ్ళే ముందు ర‌జ‌నీ బాడీ మెజ‌ర్‌మెంట్స్ మొత్తం తీసుకున్న‌ట్టు కూడా ప్రచారం జరుగుతోంది. 

దీనికి కారణం ర‌జ‌నీ ఆరోగ్య ప‌రిస్థితి రీత్యా ‘రోబో 2.0’ మిగిలిన స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ‌కు ముందు జాగ్ర‌త్త దృష్ట్యా కూడ శంక‌ర్ ర‌జ‌నీకాంత్ బాడీ మెజ‌ర్‌మెంట్స్ తీసుకున్న‌ట్టు కోలీవుడ్ లో వార్తలు హడావిడి చేస్తున్నాయి. ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియకపోయినా హడావిడి చేస్తున్న ఈ గాసిప్పులను చూసి ‘కబాలి’ సినిమాను భారీ మొత్తాలకు కొనుక్కున్న బయ్యర్లు బెదిరి పోతున్నట్లు టాక్.

ఈ వార్తలు ఇలా ఉండగా రజినీకాంత్ ‘కబాలి’ కి సంబంధించిన యాప్ ను ఈరోజు సాయంత్రం విడుదల చేస్తున్నారు. ఈసినిమాలో రజినీ ‘కుతు’ అనే తమిళ సంప్రదాయ నృత్యం చేసే సన్నివేశం ఉందట. దీనికి సంబంధించిన టీజర్ ను కూడ ఈరోజు విడుదల చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ‘కబాలి’ థీమ్‌ కీచైన్లు, మైనపు బొమ్మలు అమ్మకంతో హడావిడి చేస్తున్న ‘కబాలి’ టీమ్ ఈసినిమాకు సంబంధించి రజినీకాంత్ లుక్ తో స్మార్ట్ ఫోన్స్ కవర్లు టి.షర్టులు చేస్తున్న హడావిడి మధ్య రజినీకాంత్ ఆరోగ్యానికి సంబంధించిన వార్తలు గందరగోళంగా మారుతున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: