మెగా డాటర్ నిహారిక నటించిన ఒక మనసు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాలో కథ కథనాలు ఎలా ఉన్నా సరే నిహారిక నటనకు అందరు తనకు బెస్ట్ విశెష్ అందిస్తున్నారు. సంధ్యగా ఆమె నటన సింప్లీ సూపర్బ్.. మొదటి సినిమానే ఇలాంటి అభినయం కలిగిన పాత్ర చేసినందుకు నిహారికను మెచ్చుకోదగిన విషయమే.


అయితే నాగ శౌర్యను సినిమా కోసం సంప్రదించినపుడు సినిమాలో హీరోయిన్ గా నిహారిక అని తెలియగానే తను షాక్ అయ్యాడట. మెగా డాటర్ గా నిహారిక ఈ రోల్ లో మెప్పిస్తుందా అన్న డౌట్ వచ్చిందట.. కాని తను చేస్తున్నప్పుడే అందరు క్లాప్స్ కొట్టేవారట. ఇక నాగశౌర్య అయితే ఆమె నటనకు విస్తుపోయాడని అంటున్నారు. రామరాజు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మధుర శ్రీధర్ నిర్మించగా టివి-9 భాగస్వామ్యం అయ్యింది. 


మెగా ఫ్యామిలీ నుండి మొదటిసారి హీరోయిన్ గా నటించిన నిహారిక ఎన్నో బరువు భాద్యతలు తన మీద ఉన్నాయని తెలుసు. ఫ్యాన్స్ హర్ట్ అవ్వకుండా సినిమాలో నటించాలి.. అందుకే ఒక మనసులాంటి అభినయం ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించింది. సినిమా పొయెటిక్ వే లో వెళుతుంది అన్న టాక్ వస్తుంది.


అయితే నిహారిక డెశిషన్ మాత్రం అందరు మెచ్చుకుంటున్నారు. ఇటువంటి సినిమాతో ఆమె ఎంట్రీ ఇవ్వడం అందరిని ఇంప్రెస్ చేసింది. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ మొత్తం నిహారిక సినిమా చూసి తమ అభినందనలు తెలుపుతున్నారు.     



మరింత సమాచారం తెలుసుకోండి: