భారీ అంచనాలతో ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ‘ఒక మనసు’ సినిమాను చూసిన అమ్మాయిలు అంతా ఈసినిమాలోని ఒక విషయంలో మాత్రం మైండ్ బ్లాంక్ అయిపోయి నిహారిక పై సెటైర్లు వేస్తున్నారు. ఈసినిమాకు ప్రధాన మైన హైలైట్ నిహారిక లుక్ అని ప్రచారం చేసి  కాటన్ చీరలు చుడీదార్లతో నిహారిక ప్రతీ ఫ్రేమ్ లోనూ ఎంతో అందంగా  కనిపిస్తుంది అని ప్రచారం చేసారు. 

వాస్తవానికి 30-40 సన్నివేశాలకు గాను 60-70 డ్రస్సులతో  ఈసినిమాలో నిహారిక కనిపించింది. ఎక్కడా ఆర్భాటం లేకుండా  శారీస్ - చుడీదార్లు - పంజాబీ డ్రస్సులు దానికి తగ్గట్లుగా మ్యాచింగ్ ఆర్నమెంట్స్ తో  కనిపించింది నిహారిక. ఆమె వేసుకున్న డ్రస్సుల డిజైనింగ్ అంతా నాగబాబు భార్య పద్మజ కొణిదెల చేసిందిఅనే వార్తలు ఉన్నాయి. 
అయితే కూతురును సినిమా రంగానికి పరిచయం చేస్తూ ఆమె  ఇలాంటి డిజైన్స్ సెలెక్ట్ చేసింది ఏమిటి అంటూ ఈసినిమాను చూసిన చాలా మంది అమ్మాయిలు కామెంట్ చేస్తున్నట్లు టాక్.  

దీనికి కారణం నీహారిక కట్టిన చీరలు, డ్రస్సులకు మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రథమార్థంలో ఫరవాలేదు కానీ ద్వితయార్థంలో నీహారిక కట్టిన చీరలు చూస్తుంటే అమ్మమ్మల కాలంనాటి వీటిని నిహారిక తల్లి పద్మజ ఎలా ఎంపిక చేసింది అని కామెంట్స్ చేసుకుంటున్నట్లు టాక్. అంతేకాదు ఈతరం అమ్మాయిలు  కడుతున్న  పార్టీ వేర్ రకాలు ఎన్నో ఉన్నాయి శారీల్లో కూడా అద్భుతమైన చీరలు వస్తున్న విషయాన్ని మరిచిపోయి  మిడిల్ ఏజ్డ్ వాళ్లు కూడా కట్టుకోవడానికి ఆలోచించే  డిజైన్స్ ప్లెయిన్ చీరలు తీసుకువచ్చి నీహారికకు చుట్టబెట్టి ఆమె లుక్ ను పాడుచేసారు అంటూ ఏకంగా అమ్మాయిలే కామెంట్ చేస్తూ ఉండటం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. 

అయితే చాలా మంది అమ్మాయిలు మాత్రం ఈసినిమాలోని నాగశౌర్య డ్రెస్ లకు మంచి మార్కులు వేస్తున్నారని టాక్. ఫీల్‌ గుడ్‌ మూవీ గా   గ్లామర్ వల్గారిటీకి  ఛాన్స్ లేకుండా కమర్షియల్‌ యాంగిల్‌  ఉన్న బయట పడనీయకుండా అనేక లెక్కలు వేసుకుని తీసిన ‘ఒక మనసు’ నిర్మాణంలో తీసుకున్న అతి జాగ్రత్తలు  సామాన్య ప్రేక్షకులనే కాదు మెగా అభిమానులను కూడ గందరగోళంలో పడేసి నిహారిక తొలి సినిమాను బాగాదెబ్బ తీసింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: