తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి వారసులుగా ఇప్పటికే చాలా మంది హీరోలు వచ్చారు..అయితే మెగా బ్యాగ్ గ్రౌండ్ ఏమాత్రం ఉపయోగించుకోకుండా ఎవరికి వారే తమ టాలెంట్ చూపిస్తూ మెగా ఫ్యాన్స్ కి బాగా దగ్గరయ్యారు. రీసెంట్ గా వస్తున్న వరుణ్ తేజ, సాయిధరమ్ తేజ లు కూడా తమ సత్తా చాటుతూ మంచి హిట్స్ కొట్టారు. తాజాగా మెగా ఫ్యామిలీ నుంచి ఓ వారసురాలు వస్తుందని గత కొంత కాలంగా ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. మెగా బ్రదర్ నాగబాబు కూతురు కొణిదెల నిహారిక హీరోయిన్ గా ‘ఒక మనసు’ చిత్రంతో ప్రజల ముందుకు వచ్చింది. అయితే ఇప్పటికే ఈ అమ్మడు ఢీ డ్యాన్స్ ప్రోగ్రామ్ తో బాబ్లీగా కనిపిస్తూ తన చలాకీ యాంకరింగ్ తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. అయితే ఫస్ట్ టైమ్ వెండి తెరపై హీరోయిన్ ఎలా ఉండబోతుందా అని నిన్నటి వరకు అటు మెగా ఫ్యామిలీ, ఇటు ఫ్యాన్స్ ఎదురు చూశారు. మొత్తానికి నిన్న సినిమా రిలీజ్ అయ్యింది..కానీ ఈ అమ్మడు పాత సినిమాల్లో హీరోయిన్ గా కనిపించిందట.

యాక్షన్ పరంగా తన పాత్రకు సరైన న్యాయమే చేసిన నిహారిక నటిగా నిహారిక సత్తా చాటినప్పటికి పేలవమైన స్క్రీన్ ప్లే , ఎందుకు ఏ డైలాగ్ వస్తుందో తెలియని తికమక లో సినిమా ఆసాంతం ప్రేక్షకులకు పెద్ద నస లా తయారై ,ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టిందంటే ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అంతే కాదు ఈ చిత్రంలో మాస్ ప్రేక్షకులను ఆకర్షించే అంశం ఒక్కటి కూడా లేకపోవడం చాలా మందిని నిరాశ పరిచింది. అంతే కాదు మెగా ఫ్యాన్స్ అనగానే చాలా కమర్షియల్ గురించే ఎక్కువ ఆలోచిస్తారు. కానీ ఈ చిత్రంలో నిహారిక ఎక్కువ చీరలు, చుడిదార్లతో కనిపించడం పోనీ రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నాయా అంటే అవికూడా లేకుండా చెతులు చేతులు కలుపుకుంటూ  సినిమా మొత్తం ఎక్కువగా ఇద్దరి పైనే రన్ అవుతుండటంతో ఆ ఇద్దరినీ అంత ఎక్కువ సేపు చూడలేక పోతున్నారు ప్రేక్షకులు .

రామరాజు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం పై రిలీజ్ కు ముందు బోలెడు అంచనాలు ఏర్పడ్డాయి . నిహారిక ని బిగ్ స్క్రీన్ లో చూడాలని ఉత్సాహపడిన వాళ్ళకు తీవ్ర నిరాశనే మిగిలించింది ఒక మనసు. ఒక దశలో చెప్పాలంటే మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ గా నిహారిక వస్తోంది అనగానే ఎన్నో అంచనాలు కానీ ఆ అంచనాలను అందుకోవడంలో ''ఒక మనసు '' చిత్రం ఘోరంగా విఫలమయ్యిందని అంటున్నారు టాలీవుడ్ ఇండస్ట్రీ మెగా ఫ్యాన్స్.  ప్రస్తుతం ఈ సినిమాపై వస్తున్న టాక్ చూసి మెగా ఫ్యామిలీ మెంబర్స్ షాక్ అయినట్లు తెలుస్తుంది. మొదటి సారిగా తమ కుటుంబం నుంచి వచ్చిన సినిమా హీరోయిన్ ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో ఒకింత బాధపడుతున్నట్లు సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: