మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చిరంజీవి 150వ సినిమా ప్రారంభం అయి అప్పుడే రెండు రోజులు షూటింగ్ కూడ పూర్తి అయిపోయింది. దర్శకుడు వినాయక్ ఇప్పటి వరకు చిత్రీకరించిన సీన్స్ రష్ చూసి చిరంజీవి కూడ చాల హ్యాపీ ఫీల్ అయ్యాడు అని టాక్. అయితే సినిమా షూటింగ్ ప్రారంభం అయినా ఇంకా ఈసినిమాకు సంబంధించి హీరోయిన్ సమస్య ఇంకా ఒక కొలుక్కి రాలేదు అన్న వార్తలు వస్తున్నాయి. 

దీపికా పదుకొనె అడుగుతున్న భారీ పారితోషికం ‘కత్తిలాంటోడు’ బడ్జెట్ ను ఇంకా పెంచేస్తుంది అన్న ఉద్దేశ్యంతో రకరకాల ఆలోచనలు చేసి చిరంజీవి పక్కన అనుష్కను ఫైనల్ చేయడానికి నిర్ణయించినట్లు టాక్. అయితే అనుష్కకు కూడ ఈసినిమాలో నటించాలని కోరిక ఉన్నా ఇప్పటికే ఆమె డేట్స్ ప్రభాస్ కు చెందిన యు.వి. నిర్మాణ సంస్థ దగ్గర ఉండటంతో డేట్స్ ను కాస్త అటుఇటుగా మార్చి చిరంజీవి 150వ సినిమాకు అదేవిధంగా యు.వి. నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న ‘భాగమతి’ సినిమాకు ఉపయోగపడే విధంగా ప్లాన్ సెట్ చేయాలని మెగా కాంపౌండ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు టాక్. 

అయితే ఈ ప్లాన్ సక్సస్ అవ్వాలి అంటే యు.వి. నిర్మాణ సంస్థకు బ్యాక్ బోన్ లా ఉండే ప్రభాస్ అంగీకారం అత్యంత అవసరం కావడంతో అనుష్క డేట్స్ విషయమై ప్రభాస్ సహకారాన్ని కూడ తీసుకోవడానికి ఈసినిమాను నిర్మిస్తున్న రామ్ చరణ్ అప్పుడే తన వంతు ప్రయత్నాలు మొదలు పెట్టాడు అని టాక్. ప్రభాస్ కు చరణ్ కు ఉన్న సాన్నిహిత్యం రీత్యా అనుష్కను ‘కత్తిలాంటోడు’ సినిమాకు డేట్స్ సరిపెట్టే విధంగా ఒక అంగీకారం కుదురుతుంది అన్న భావానలో చరణ్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ విషయాల పై క్లారిటీ రావానికి కొద్ది రోజులు పడుతుంది కాబట్టి ముందుగా చిరంజీవికి సంబంధించిన సీన్స్ ను వినాయక్ చాల స్పీడ్ గా చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నిన్న చిరంజీవి ‘జక్కన్న’ ఆడియో ఫంక్షన్ ను ముగించుకుని తిరిగి రాత్రి సమయంలో కూడ ‘కత్తిలాంటోడు’ షూటింగ్ లో పాల్గొన్నాడు అంటే చిరంజీవి ఈ సినిమా పై ఎంత పట్టుదలతో వేగంగా పూర్తి చేయాలని అనుకుంటున్నా డో అర్ధం అవుతుంది..      


మరింత సమాచారం తెలుసుకోండి: