తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ కుటుంబం నుంచి వచ్చిన హీరోలు అందరూ మంచి ఫామ్ లో కొనసాగుతున్నారు. ఈ మద్య వచ్చిన సాయిధరమ్ తేజ సుప్రీమ్ చిత్రంతో రికార్డు స్తాపించారు. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున అయితే ‘సరైనోడు’ చిత్రంతో బంపర్ హిట్ కొట్టడమే కాకుండా మళియాల ఇండస్ట్రీలో కూడా తన సత్తా చాటాడు. ఇలా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు అందరూ తమ ఇమేజ్ కి తగ్గట్టు మాస్ ఫాలోయింగ్ సంపాదించుకోవడమే కాకుండా మెగా ఫ్యాన్స్ కావాల్సని డ్యాన్స్, ఫైట్స్ లో తమదైన శైలిని చూపిస్తున్నారు. ఇక మెగా బ్రదర్ నాగబాబు కూతురు కొణిదెల నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

అయితే మొదట్లో ఈ అమ్మడి ఎంట్రీ పై మెగా ఫ్యామిలీ కాస్త కస్సు బుస్సు అన్నా..తర్వాత ఒకే చెప్పడం..ఒక మనసు ఆడియో ఫంక్షన్లో సందడి చేయడంతో సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇక మెగా ఫ్యాన్స్ అయితే మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న అమ్మాయి మొదటి సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని ఎంతో ఆశపడ్డారు. ఎన్నో భారీ అంచనాల మద్య వచ్చిన ‘ఒక మనసు’ చిత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో అటు మెగా ఫ్యామిలీ ఇటు ఫ్యాన్స్ బాగా నిరుత్సాహ పడ్డారు.

ఇక నటన పరంగా నిహారిక బాగా మెప్పు పొందినా కథ కథనం సక్సెస్ కాకపోవడంతో సినిమా మొదట మిశ్రమ స్పందన వచ్చినా తర్వాత ఫ్లాప్ టాక్ వచ్చింది. ఏది ఏమైనా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి అమ్మాయి మొదటి సినిమా ఇలా కావడంపై ఫ్యాన్ మాత్రం చాలా బాధపడుతున్నారట. 


మరింత సమాచారం తెలుసుకోండి: