చిరంజీవి తన 150వ సినిమా ‘కత్తిలాంటోడు’ షూటింగ్ ప్రారంభించిన సందర్భంగా ఈరోజు ఒక ప్రముఖ తెలుగు దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన 150వ సినిమా గురించి అనేక ఆసక్తికర విషయాలను బయట పెట్టాడు. తన సినిమా షూటింగ్ కు మూడు రోజులు ముందే తన ఇంటిలో కాస్ట్యూమ్స్ తో టోటల్ గెటప్ వేసుకుని ఫస్ట్ లుక్ తీయించుకున్న విషయాన్ని బయట పెట్టాడు. 

ఆ తరువాత ఆ క్లిపింగ్స్ ను చూసి తన కుటుంబ సభ్యులతో పాటు తన సన్నిహితులు కూడ ఆ క్లిపింగ్స్ చాల బాగున్నాయి అని అనడమే కాకుండా 20 ఏళ్ల క్రితం నాటి చిరంజీవి కనిపిస్తున్నాడు అని అందరూ సంతృప్తి వ్యక్తం చేయడంతో దాదాపు 9 ఏళ్ల తరువాత తన సినిమాను మొదలు పెట్టిన విషయాన్ని షేర్ చేసాడు. తన లుక్ కు సంబంధించి ముందుగా వచ్చే స్పందన తన భార్య సురేఖ నుంచి అని చెపుతూ ఆమె తన ‘కత్తిలాంటోడు’ గెటప్ కు సర్టిఫికేట్ ఇవ్వడంతో ఇక తనకు ఎదురు లేదు అంటూ ‘బాస్ ఈజ్ బ్యాక్’ అంటూ తన పై తానే సెటైర్ వేసుకున్నాడు.

ప్రస్తుతం యంగ్ హీరోల మధ్య పోటీ విపరీతంగా పెరిగి పోవడంతో తాను త్రిమ్ గా మారి యంగ్ హీరోలందరికీ షాక్ ఇవ్వడానికి తాను చాల కష్ట పడ్డాను అని చెపుతూ తన ఫిట్ నెస్ సీక్రెట్ రహస్యాలను కొన్ని బయట పెట్టాడు. తన 150వ సినిమా కోసం ప్రతిరోజు గంటన్నర జిమ్ లో వ్యాయామం చేసానని అదేవిధంగా ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటు కార్బోహైడ్రేట్స్ చాల తక్కువగా ఉండేలా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఒక డైటీషియన్ సలహాలతో తన కత్తిలాంటి ‘కత్తిలాంటోడు’ లుక్ ఏర్పడింది అన్న విషయాన్ని బయట పెట్టాడు.

తన అభిమానులు కోరుకునే ఫైట్స్ డాన్స్ లు కామెడీ పంచ్ లు అన్నీ కలబోసిన మిశ్రమంగా తన 150వ సినిమా రూపొందుతోంది అంటూ అన్నీ అనుకున్నట్లుగా జరిగితే రానున్న సంక్రాంతి రేస్ కు తాను రెడీ అవుతున్న విషయాన్ని కూడ బయట పెట్టాడు. చిరంజీవి ఓపెన్ గా చెప్పిన మాటలను చూస్తూ ఉంటే చిరూ ‘కత్తిలాంటోడు’ బాలకృష్ణ 100వ సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ తో ఢి కొట్టడం ఖాయం అని అనిపిస్తోంది..



మరింత సమాచారం తెలుసుకోండి: