తెరంగేట్రం చేసి దాదాపు 14 సంవత్సరాలవుతున్నా స్టార్ ఇమేజ్ సంపాదించడంలో వెనుకబడి ఉన్నాడు నితిన్.. లవర్ బోయ్ ఇమేజ్ తో నెట్టుకొద్దామన్నా సరైన కథలు దొరకలేదు.. ఇక మాస్ హీరోగా అయితే కెరియర్ కే ఎసరు పెట్టేలా చేశాయి. అందుకే తనకు నప్పే కథలతోనే మళ్లీ ఫాంలోకి వచ్చాడు నితిన్. ఇక రీసెంట్ గా అఆ హిట్ తో నితిన్ లో ఓ కొత్త ఉత్సాహం వచ్చింది. 


త్రివిక్రం వల్ల సినిమా ఆడినా నితిన్ ఎలాంటి సినిమాలు తీయాలన్న క్లారిటీ వచ్చింది.. అందుకే ఇక నుండి వరుసెంట సినిమాలు చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. అంతేకాదు అఆ హిట్ తో నితిన్ తన రెమ్యునరేషన్ కూడా పెంచేశాడని అంటున్నారు. మొన్నటిదాకా 2 నుండి 4 కోట్లు తీసుకుంటున్న నితిన్ ఇకనుండి 5-7 కోట్లు అంటున్నాడట. 


అఆ 50 కోట్ల మార్క్ టచ్ చేసే సరికి తనకు స్టార్ రేంజ్ వచ్చిందంటూ పారితోషికం పెంచేశాడు. అయితే మరి నితిన్ కు అంత సీన్ ఉందా అన్నది మ్యాటర్.. దర్శకులు పర్ఫెక్ట్ గా ఉంటే సినిమా సక్సెస్ కొట్టగల సామర్ధ్యం ఉన్న నితిన్.. సోలోగా సినిమాను నడిపించే కెపాసిటీ వచ్చిందా అన్నది ఆలోచించాల్సిన విషయం. 


ఇక నితిన్ వెనుక తండ్రి సుధాకర్ రెడ్డి సపోర్ట్ గా ఉన్నా.. ఈ మధ్య నితిన్ తన సొంత నిర్ణయాలతోనే సక్సెస్ అవుతున్నాడని అంటున్నారు. మరి నితిన్ ఈ సక్సెస్ మజా ఎన్నిరోజులు ఎంజాయ్ చేస్తాడో చూడాలి. ఇక హిట్ వచ్చింది కదా అని తలకు ఎక్కించకుండా సినిమా సినిమాకు మంచి అవుట్ పుట్ ఇస్తే నితిన్ హిట్ కొట్టడం కష్టమేమి కాదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: