స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరైనోడు తర్వాత రెండు నెలలు కావొస్తున్నా ఇంకా ఏ సినిమా కమిట్ అవ్వకపోవడం కాస్త అభిమానులను ఆశ్చర్యంలో పడేస్తుంది. అయితే మరో పక్క బన్ని కోసం లైన్లో చాలామంది దర్శకులు క్యూలో ఉన్నారు. వీరందరిని కాదని బన్ని మాత్రం సడెన్ గా హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు.


షాక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హరీష్ మిరపకాయ్ తో హిట్ అందుకున్నా పవర్ స్టార్ గబ్బర్ సింగ్ సినిమాతోనే ఓ రేంజ్ కు వెళ్లాడు. అయితే ఆ రేంజ్ హిట్లు అందించలేక ఢీలా పడ్డ హరీష్ శంకర్ రామయ్య వస్తావయ్య ఫ్లాప్ అయినా సుబ్రమణ్యం ఫర్ సేల్ కాస్త ఊరటనిచ్చింది. ఇక ఇప్పుడు మరోసారి తన ప్రతిభ చూపించేందుకు రెడీ అవుతున్నాడు. 


అయితే ఓ పక్క తమిళ దర్శకుడు లింగుస్వామి బన్నితో సినిమా తీసేందుకు రెడీగా ఉండగా బన్ని హరీష్ శంకర్ తో సినిమా చేయడం ఎవరి అర్ధం కావట్లేదు. అయితే స్టైలిష్ స్టార్ గా అభిమానుల అంచనాలను అందుకోవాలంటే హరీష్ సినిమా ఓ రిఫ్రెష్ మెంట్ ఉంటుందని బన్ని ఈ ప్లాన్ చేశాడు. ఇక ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారని తెలుస్తుంది.


సరైనోడుతో మాస్ ఊర మాస్ హిట్ అందుకున్న బన్ని కెరియర్ లో ఏ హీరోకి సాధ్యపడని 50 కోట్ల మార్క్ ను మూడు సార్లు దాటి సరికొత్త రికార్డులను సృష్టించాడు. మరి కొత్తగా కలుస్తున్న ఈ క్రేజీ కాంబో మరెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. తన మార్క్ డైరక్షన్లో బన్ని మార్క్ సినిమాతో వచ్చేందుకు త్వరలో ముహుర్తం పెట్టనున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: