మెగా హీరో మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ హిట్ వచ్చింది కదా అని రిలాక్స్ అవ్వకుండా తన తర్వాత సినిమా కార్యక్రమాలను చూస్తున్నాడు. సుప్రీం తో సూపర్ హిట్ అందుకున్న సాయి ధరం తేజ్ ఇప్పుడు తిక్క అంటూ రాబోతున్నాడు. పవర్ స్టార్ గబ్బర్ సింగ్ డైలాగ్ తో వస్తున్న ఈ సినిమాను సునీల్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. 


అయితే ఈ తిక్క సినిమా హిట్ అవుతుంది అనడానికి ఓ ఫార్ములా ఉంది.. అదెలా అంటే కళ్యాణ్ రాం సినిమాను డైరెక్ట్ చేస్తున దర్శకుడు వెంటనే సాయి ధరం తేజ్ తో సినిమా తీస్తే అది హిట్ అన్నట్టే. ఆ విషయం పటాస్ డైరక్టర్ సుప్రీం సినిమాతో హిట్ కొట్టిన విధానం చూస్తే అర్ధమవుతుంది. సో అలానే తిక్క దర్శకుడు సునీల్ రెడ్డి కళ్యాణ్ రాంతో ఓం త్రిడి సినిమా తీశాడు.


సో ఈ ఫార్ములాతో సాయి ధరం తేజ్ కు తిక్క హిట్ అన్నట్టే మరి.. అయితే పటాస్ దర్శకుడు అనీల్ కళ్యాణ్ రాం కు హిట్ ఇచ్చాడు కాబట్టి సుప్రీం కూడా హిట్ అయ్యింది. మరి సునీల్ ఓం త్రిడి ఫ్లాప్ అయ్యింది మరి ఆ లెక్కన తిక్క కూడా లెక్క తప్పే అవకాశం ఉంది.. ఏది ఏమైనా ఈ ఫార్ములాలన్ని సరదాగా మాత్రమే సినిమాలో కంటెంట్ ఉంటే ఎలా ఉన్నా హిట్ అవుతుంది.


వారు కోరుకునే ఎంటర్టైన్మెంట్ సినిమాలో ఉండేలా చూసుకుంటే తిక్క హిట్ అయినట్టే.. అదీగాక మెగా మేనరిజాలతో సాయి ధరం తేజ్ ఓ సెపరేట్ క్రేజ్ సంపాదించాడు. మరి ఎలాగు మెగా అభిమానుల ఫాలోయింగ్ ఉంది కాబట్టి మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ తిక్కతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంటాడో లేదో చూద్దాం. 



మరింత సమాచారం తెలుసుకోండి: