కమల్ గారాల పట్టి శృతి హాసన్ మల్టీటాలెంటెడ్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది.. అదేవిధంగా అంతకు అంత బ్యాడ్ నేం కూడా మూటకట్టుకుంటుంది.. అదెలా అంటారా ఒప్పుకున్న సినిమాలను సడెన్ గా హ్యాండ్ ఇచ్చేస్తున్నట్టు ఇప్పటికే శృతి మీద తెలుగు దర్శక నిర్మాతలే గుర్రుగా ఉన్నారు. ఇప్పుడు తమిళంలో కూడా ఓ సినిమా యూనిట్ ముఖ్యంగా ఓ హీరో ఆమె గురించి బ్యాడ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నాడు.


ఇంతకీ విషయం ఏంటి అంటే.. కోలీవుడ్ లో కష్టంతో పైకి వచ్చిన హీరో శివకార్తికేయన్.. తను సైకిల్ తో వెళ్లి ఉద్యోగం చేసిన టివి ఆఫీస్ కు ఇంటర్వ్యూ ఇచ్చేందుకు వెళ్లే రేంజ్ కు వచ్చిన ఈ హీరో టాలెంట్ ను నమ్ముకున్నాడు. అయితే ప్రస్తుతం శివ చేస్తున్న రెమో సినిమాకు ముందుగా చాలామంది హీరోయిన్స్ ను వెతికారట. ఇక హీరోయిన్ గా శృతిను అడిగితే శివకార్తికేయన్ తో చేసేందుకు తాను సిద్ధంగా లేను అన్నదట.


అయితే అది మనసులో పెట్టుకున్న హీరో.. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసే సమయంలో తన సినిమాలో హీరోయిన్ గా చాలామంది హీరోయిన్స్ ను అడిగామని.. వారు కాదన్నందుకు థాంక్స్ అని చెప్పి.. వారు ఒప్పుకుని ఉంటే కీర్తి సురేష్ ను మిస్ అయ్యే వాళ్లం.. ఈ పాత్రకు తానే పర్ఫెక్ట్ అన్నాడు శివకార్తికేయన్. అంటే ఈ లెక్కన శృతి కాదన్న విషయం మనసులో పెట్టుకుని ఈ విషయాన్ని ఇలా చెప్పాడు ఈ హీరో..


ఇక తమిళంలో ఈ హీరో క్రేజ్ రోజు రోజుకి పెరిగిపోతుంది.. చిన్న బడ్జెట్ లతో పెద్ద విజయాలను అందుకుంటున్న కార్తికేయన్ అభిరుచి గల సినిమాలు తీసుకుంటూ కెరియర్ లో సక్సెస్ లను కొడుతున్నాడు. మరి ఇదే సక్సెస్ జోరుని కొనసాగించాలని శివకార్తికేయన్ కు ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం.



మరింత సమాచారం తెలుసుకోండి: