ప్రస్తుతం విపరీతమైన ఫార్మ్ లో కొనసాగుతున్నాడు హీరో బన్నీ .. ఏ డైరెక్టర్ అయినా అతనితో సినిమా చెయ్యడం అంటే తెలుగు లో టాప్ హీరోతో చెయ్యడమే అన్న చందంగా మారిపోయింది పరిస్థితి. బన్నీ సినిమాలకి ఉన్న బెనిఫిట్ ఏంటి అంటే ఎలాంటి ఎక్స్ పెక్టేషన్ లూ లేకుండా ప్రేక్షకులు థియేటర్ ల దగ్గర వాలిపోతారు. ఏ మాత్రం అద్భుతాలు ఆశించరు. పైగా కాంపిటీషన్ లేని సరైన  టైం చూసి సినిమాలు దింపుతారు.

 

పవన్ కళ్యాణ్ - మహేష్ బాబు ల సినిమాల టైపు లో విపరీతమైన కంటెంట్ ఆశించారు. " ఈ సినిమా చూడచ్చు పర్లేదు బాగుంది " అనే టాక్ వస్తే చాలు బన్నీ సినిమాలు ఒక రేంజ్ లో ఆడేస్తాయి . అయితే సరైనోడు లాంటి ఆల్ టైం హిట్ కొట్టిన బన్నీ కి నెక్స్ట్ ఏ డైరెక్టర్ తో సినిమా తీయాలి అనే మీమాంస ఇంకా తొలగలేదు. ఈ విషయం లో స్పష్టత కోసం అతను ఇంకా ఎదురు చూస్తున్నాడు. మరొక పక్క డైరెక్టర్ లు బన్నీ కోసం భారీ క్యూ లు కడుతున్నారు. కాస్తంత క్లారిటీ ప్రకారం చూస్తే విక్రం కుమార్ - లింగు స్వామీ లకి నో చెప్పిన బన్నీ హరీష్ శంకర్ వైపు మొగ్గు చూపాడు అంటునారు. దిల్ రాజు కూడా అఫీషియల్ గా ఈ విషయం ప్రకటించడం తో బన్నీ విక్రం ని ఎందుకు వదులుకున్నాడు అనే చర్చ నడుస్తోంది. సరైనోడు లాంటి భారీ మాస్ ఎలిమెంట్ లు ఉండే సినిమా చేసిన బన్నీ ఇప్పుడు క్లాస్ సినిమా చేస్తే బాగుంటుంది అనేది ఫాన్స్ కోరిక కూడా

 

బన్నీ తెలివితేటలు

 

విక్రం కుమార్ ,లింగు స్వామీ ఇద్దరూ బన్నీ ని మొన్నామధ్య కలిసారు. విడివిడిగా స్క్రిప్ట్ లు చెప్పిన వీళ్ళలో లింగు స్వామీ చెప్పిన స్క్రిప్ట్ బన్నీ కి బాగా నచ్చిందట.  ఆ స్క్రిప్ట్ ప్రకారం చూస్తే లింగు స్వామి పేరుతో తమిళ్ లో కూడా మార్కెట్ పెంచుకునే ఛాన్స్ ఉంది కదా అని బన్నీ ప్లాన్. హరీష్ శంకర్ పూర్తి ఎలివేషన్ లతో స్క్రిప్ట్ రాయగా అది కూడా బన్నీ కి బాగా నచ్చేసింది.

 

 కానీ విక్రమ్ కె. కుమార్ ఇంకా బన్నీకి తగ్గ స్క్రిప్ట్ రెడీ కాలేదని చెప్పాడు. పైగా నితిన్ తో ముందుగా సినిమాకి మొగ్గాడు. ఇపుడు బన్నీ హరీష్ శంకర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. సో లింగు స్వామి గనక తుది స్క్రిప్ట్ లో బన్నీ కి పర్ఫెక్ట్ స్క్రిప్ట్ ఇవ్వగలిగితే రెండు సినిమాలూ దాదాపు ఒకే సమయం లో మొదలు పెడదాం అనుకుంటున్నాడట. సబ్జెక్ట్ లో ఎక్కువ టైం తీసుకునే లింగు స్వామీ, షూటింగ్ త్వరగా పూర్తి చేసే హరీష్ శంకర్ కీ ఒకే సారి ఓకే చెప్పి తన ప్లాన్ అమలు చేసాడు బన్నీ.


మరింత సమాచారం తెలుసుకోండి: