టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కెరీర్ ని కొనసాగిస్తున్న హీరోయిన్ సమంత. ప్రస్తుతం సమంత సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే క్రేజీ చిత్రాలను చేస్తుంది. అయితే ఇప్పటి వరకూ గ్లామరస్ పాత్రలను చేసింది కానీ, ఎన్నడూ ఎక్స్ పోజింగ్ వంటివి చేయలేదు. తాజాగా ఓ టాప్ ప్రొడ్యూసర్ సమంతకి భారీ ఆఫర్ ని ఇచ్చారు.


కోలీవుడ్ కి చెందిన ప్రముఖ హీరో సరసన ఆఫర్ ని ఇవ్వటమే కాకుండా అందులో బికిని ధరించాలంటూ చెప్పుకొచ్చాడు. అందుకు సమంత కచ్ఛితంగా నో అని చెప్పేసిందట. అంతే కాకుండా రెమ్యునరేషన్ భారీగా వస్తుందని బికిని సీన్స్ ని వేయమంటే వేయను, కథకి అవసరం అనుకుంటే మాత్రమే ధరిస్తాను అంటూ క్లాస్ పీకిందట.


ముఖ్యంగా తనకి ఎక్స్ పోజింగ్ అంటే అస్సలు ఇష్టం లేదు, ఇది తెలిసి కూడ ఇలాంటి ఆఫర్స్ ఇవ్వటానికి ఎలా వచ్చారు? అంటూ నోటికి వచ్చినట్టుగా మాట్లాడిందంట. ప్రస్తుతం సమంత చాలా మూవీలను చేస్తుంది, అందులో టాప్ హీరో మూవీ అంటే కచ్ఛితంగా ఒప్పుకుంటుందనే ఉద్ధేశంతో ఆ నిర్మాత ఈ విధమైన సాహసం చేశాడని అంటున్నారు.


లేదంటే సమంతకి ఈ విధమైన ఆఫర్ చేసేవాడు ఏ మాత్రం కాదని అంటున్నారు. మొత్తానికి సమంత, తన భవిష్యత్ లో ఇటువంటి ఎక్స్ పోజింగ్ రోల్స్ ని చేయనుఅంటూ క్లారిటీగా చెప్పుకొచ్చింది. ఈ నిర్మాత ద్వారా తను చెప్పదలుచుకున్న మెసేజ్ అందరికి వెళుతుందని సమంత గట్టిగా నమ్మింది. ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: