‘ఈగ’ లాంటి చిన్నజీవి పై సినిమా తీసి కోట్లుఎలా కొల్ల గొట్టాలో రాజమౌళి మార్గం చూపించాడు. ఇప్పుడు అదే మార్గాన్ని అనుసరిస్తూ విలక్షణ దర్శకుడు రవిబాబు పంది పిల్లను ప్రధాన పాత్రగా తీసుకుని ఒక చిత్రం ప్లాన్ చేయడమే కాకుండా చడీచప్పుడు లేకుండా ఆసినిమాను ఇంచుమించు  పూర్తి చేయడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. విభిన్నమైన  సినిమాలకు చిరునామాగా ఉండే రవిబాబు పందిని  ప్రధాన పాత్రగా పెట్టి చేస్తున్న సినిమాకు ‘అదుగో’ అనే టైటిల్ ను ఫిక్స్  చేసాడు. 

ఈ సినిమాలో హీరో, హీరోయిన్‌, మిగిలిన పాత్రలూ ఉన్నా కధ అంతా పందిపిల్ల చుట్టూ తిరుగుతుంది అని టాక్. అంతేకాదు ఈసినిమాలో పంది పిల్లతో నవ్విస్తాడట  ఎమోషన్స్ కూడ పండిస్తాడట. ఏడాదిన్నర క్రితం తనకు ఈ తరహ ఆలోచన వచ్చింది అని చెపుతున్న రవిబాబు గతంలో కుక్క, పిల్లి, గుర్రం, కోతి, లాంటి జంతువులతో సినిమాలు వచ్చాయికాని  పందిపిల్లతో ఎవ్వరూ తీయలేదు అని అంటున్నాడు.

ఈ తరహా సినిమా   హాలీవుడ్‌లో మాత్రం వచ్చింది అని అంటున్నాడు. 'జురాసిక్‌ పార్క్‌' లాంటి సినిమాలు యానిమేట్రానిక్స్‌ అనే టెక్నాలజీతో తీస్తారు. 
దాన్ని కొనాలంటే ఒక పెద్ద హీరో రెమ్యునరేషన్‌ అంతఅవుతుంది కాబట్టి  ఆసాఫ్ట్‌వేర్‌ ని తయారు చేయించాం అని అంటున్నాడు రవిబాబు. ఏడు నెలల పాటు దానికే సమయం పట్టింది అని చెపుతూ టెస్ట్‌ షూట్‌ చేసినప్పుడు కొన్ని సాంకేతిక పరమైన ఇబ్బందులు ఎదురవడంతో మరో రెండు నెలలు కష్టపడి సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసి  కొంత యానిమేట్రానిక్స్‌, కొంత యానిమేషన్‌, కొంత లైవ్‌ యాక్షన్‌ ఇలా అన్నీ కలిపి సినిమాను మూడు నెలలలో పూర్తి చేసాను అని అంటున్నాడు రవిబాబు.  

అభిషేక్‌, నాబ అనే కొత్త హీరో హీరోయిన్స్ ఈసినిమా ద్వారా పరిచయం కాబోతున్నారు. సామాన్యంగా హాలీవుడ్‌లో డిస్నీ సంస్థ ఇలాంటి సినిమాలు తీసి ప్రయోగాలు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ రేంజ్ లో రవిబాబు చేస్తున్న ప్రయోగం ఎంత వరకు సక్సస్ అవుతుందో చూడాలి..  



మరింత సమాచారం తెలుసుకోండి: