జూనియర్ ఎన్టీఆర్ అల్లుఅర్జున్ ల పై సీనియర్ నటి హేమ చేసిన సంచలన వ్యాఖ్యలు టాపిక్ ఆఫ్  ది టాలీవుడ్ గా మారాయి. ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హేమ ఈవ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.  బన్నీ ఎనర్జీ అంటే  తనకు ఇష్టం అని అంటూ రబ్బర్‌ మనిషిలా డాన్స్ లు  చేసే అల్లుఅర్జున్ ను చూస్తే తనకు జెలసీగా ఉంటుంది అంటూ కామెంట్స్ చేసింది హేమ. 

ఇదే సందర్భంలో ఎన్టీఆర్‌ గురించి మాట్లాడుతూ అతడు ‘రోబో’ లాంటివాడు అని అంటూ పేజీ డైలాగ్‌ అయినా రోబోలా స్కాన్ చేసి సింగిల్‌ టేక్‌ లో చెప్పే జూనియర్ మెమరీ తనకు షాకింగ్ గా ఉంటుంది అంటూ ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించింది హేమ. ఇదే సందర్భంలో నాగార్జున గురించి మాట్లాడుతూ వెయ్యి మందిలో కూడా తనను గుర్తించి ఆప్యాయంగా పలకరించే  నాగ్  పెద్ద బిజినెస్ మెన్ అయినా కమర్షియాలిటీ నాగార్జునలో ఎక్కడా కనిపించదు అంటూ నాగ్ ను కూడ ఆకాశానికి ఎత్తేసింది. 

ఇక బ్రహ్మానందం, తనది మంచి కాంబినేషన్‌ అని అంటూ బ్రహ్మానందం తన పాత్రను ఇంప్రూవ్‌ చేస్తూ స్క్రిప్టులో ఉన్న డైలాగ్స్‌కు అదనంగా జోడిస్తే దానికి తాను సరిగ్గా రిటార్ట్‌ ఇవ్వగలుగుతాను కాబ్బట్టే తమ కాంబినేషన్ కు మంచి క్రేజ్ అన్న విషయాన్ని బయట పెట్టింది ఈ తెలుగు  సినిమా ఆంటీ. ఇప్పటి వరకు 400 సినిమాలలో నటించిన తనకు తెలుగు సినీ పరిశ్రమ పై తనకున్న ప్రేమ గురించి మాట్లుడుతూ పవర్‌ ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ క్యారెక్టర్‌, లేడీడాన్ క్యారెక్టర్‌ చెయ్యాలని ఉంది అని అంటూ తన మనసులో మాట బయట పెట్టింది  హేమ. 

ఒక నాటి ప్రముఖ నటి  నిర్మలమ్మలాగా వందేళ్లు  ఇక్కడే  ఉండిపోవాలని కలలు గంటున్న హేమ ఆశలు నేరవేరడమే కాకుండా ఆమె కలలు కంటున్న లేడీ పోలీసు ఆఫీసర్ క్యారెక్టర్ లో హేమకు అవకాశాలు ఇచ్చే దర్శక నిర్మాతలు ఎక్కడ ఉన్నారో చూడాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: