సీనియర్ యాక్టర్ రమ్యకృష్ణ ఇప్పటికే మంచి మంచి అవకాశాలను టాలీవుడ్ లో చేజిక్కించుకుంటూ ఫుల్ బిజిగా మారింది. బాహుబలి మూవీలో రమ్యకృష్ణకి ఎన్నో ఆఫర్స్ వస్తున్నాయి. అటు తమిళ్, కన్నడ లాంగ్వేజెస్ నుండి సైతం రమ్యకృష్ణ క్రేజీ ఆఫర్స్ ని చేజిక్కించుకుంటుంది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ చిరంజీవి నటిస్తున్న కత్తిలాంటోడు చిత్రంలో ఓ ప్రత్యేకమైన రోల్ నటిచంనుందనే వార్తలు ఫిల్మ్ ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తున్నాయి.


ఓ కీలక పాత్ర కోసం రమ్యకృష్ణ ని ఇందులో తీసుకోనున్నారని అంటున్నారు. ప్రస్తుతం రమ్యకృష్ణ పలు చిత్రాలలో నటిస్తూ బిజిగా ఉంది. ఆగష్టు నెలలో రమ్యకృష్ణ కి సంబంధించిన సీన్స్ ని కత్తిలాంటోడు చిత్ర యూనిట్ చిత్రీకరించనున్నారు. పది నిముషాల పాత్రలో రమ్యకృష్ణ నటించనుంది.


దీనికి సంబంధించిన స్క్రీప్ట్ ని వినాయక్ ఇప్పటికే రమ్యకృష్ణ కి వినిపించారని అంటున్నారు. ఇలా చిరంజీవి 150వ చిత్రంలో చాలా మంది హీరోయిన్స్, హీరోలు కనిపించనున్నారు. వారిలో  క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు కూడ ఈ మూవీలో కనిపించనున్నారు. మొత్తంగా రమ్యకృష్ణ, చిరంజీవి మూవీలో నటించే రోల్ ఏంటో అనేదానిపై సస్పెస్ గా ఉంది.


చిరంజీవి, రమ్యకృష్ణ కాంబినేషన్ లో వచ్చే సీన్స్ చిత్రానికి హైలెట్ గా నిలవనుందని అంటున్నారు. అయితే ఒరిజినల్ కత్తి మూవీకి సంబంధించిన కథలో డైరెక్టర్ వినాయక్ ఎన్నో మార్పులు చేశారు. కత్తి మూవీకి సంబంధింని లైన్ ని అలాగే ఉంచి, తెలుగు ఆడియన్స్ కి తగ్గట్టుగా వినాయక్ ఈ మార్పులు చేశారు. ఆ మార్పుల భాగంగానే చాలా మంది ఆర్టిస్ట్ లకి ఈ మూవీలో చోటు ధక్కిందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: