బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తాజాగా 8 కోట్ల రూపాయలు నష్టపోయాడంటూ ఇండస్ట్రీలో టాక్స్ వస్తున్నాయి. బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వస్తున్న ఈ న్యూస్ కి సంబంధించిన విషయాలను ఓసారి చూస్తే, గతంలో ఓ ప్రొడ్యూసర్ షారుఖ్ ఖాన్ వద్దకి వచ్చి గ్రాఫిక్స్ ఓరియంటెడ్ చిత్రాన్ని తీయాలని వచ్చాడంట. అయితే ఆ మూవీ బడ్జెట్ దాదాపు 200 కోట్ల రూపాయలుగా లెక్కతేలింది.


ఇది ఓం శాంతి ఓం మూవీ జరుగుతున్న సమయంలో జరిగిన వ్యవహారం. అయితే మొదటగా ఈ మూవీకి సంబంధించిన గ్రాఫిక్స్ ని స్టార్ట్ చేయాలని భావించారు. ఇక ఈ ప్రాజెక్ట్ వివరాలను తెలుసుకున్న షారుఖ్, ఈ మూవీలోనూ తను ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఈ భారీ బడ్జెట్ మూవీలో రెమ్యునరేషన్ తో సంబంధం లేకుండా దాదాపు 30 శాతం పెట్టుబడులను పెట్టాడు షారుఖ్.


అయితే గ్రాఫిక్స్ ని మాత్రం ప్రొడ్యూజర్ కి ఉన్న సొంత విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలో వర్క్ ని స్టార్ట్ చేశారు. ఇక 30శాతం షేర్ ఉన్న షారుఖ్, ఆ నిర్మాత బాగా తెలిసిన వాడు కావటంతో గుడ్డిగా ఒక 8 కోట్ల రూపాయలను నిర్మాతకి ఇచ్చాడు. ఆ ప్రాజెక్ట్ రెండు సంవత్సరాలైన అప్ డేట్ కాకపోవటంతో, ప్రొడ్యూసర్ ఆఫీస్ కి వెళ్ళి విజువల్ ఎఫెక్ట్స్ ప్రొగ్రెస్ ని చూడాలని భావించాడు.


కానీ అక్కడకు వెళ్ళి చూస్తే, అస్సలు గ్రాఫిక్స్ వర్కే స్టార్ట్ కాలేదని తేలింది. దీంతో తన డబ్బలు వెనక్కి తిరిగి ఇవ్వాలని షారుఖ్ ఖాన్, ఆ నిర్మాతని ఒత్తిడి చేశాడు. అనుకోని విధంగా అన్ని వ్యాపారాల్లో నష్టాలు రావటం వల్ల ఇప్పట్లో తిరిగి ఇవ్వలేను అంటూ లీగల్ గా వెళ్ళాడు. ఇప్పటి వరకూ ఆ డబ్బులు షారుఖ్ ఖాన్ వద్ద చేరుకోలేదని తాజాగా ఈ న్యూస్ బయటకు వచ్చింది. దీంతో బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ దాదాపు 8 కోట్ల మేర నష్టపోయాడంటూ టాక్స్ బయటకు వచ్చాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: