ఫిల్మ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలతో మూవీలు అంటే సామాన్య విషయం కాదు. వారి మూవీలకి సంబంధించిన బడ్జెట్ దాదాపు కోట్ల రూపాయలలో ఉంటుంది. అలాగే రెమ్యునరేషన్ విషయానికి వచ్చినా, హీరోలకి చెల్లించే రెమ్యునరేషన్ కోట్ల రూపాయలలోనే ఉంటుంది. ఇంత పెద్ద రెమ్యునరేషన్ ని హీరోలకి లిక్విడ్ క్యాష్ రూపంలో ఇవ్వాలంటే నిర్మాతలకి చాలా కష్టం అవుతుంది.


గతంలో హీరోలకి కొద్ది మొత్తం అయితే కేవలం లిక్విడ్ క్యాష్ రూపంలోనే రెమ్యునరేషన్ ని ఇచ్చేవారు. ఎప్పుడైతే హీరోలకి మార్కెట్ పై ఆసక్తి చూపుతున్నారో, అప్పటి నుండి హీరోలకి రెమ్యునరేషన్ కింద ఏరియా రైట్స్ ని ఇచ్చేస్తున్నారు. ఈ తరహా పద్దతి ఒక రకంగా చెప్పాలంటే చిరంజీవి కాలం నుండే ఉండేది. చిరంజీవి సైతం ఎక్కువుగా తన రెమ్యురేషన్ కింద నైజాం రైట్స్ ని అడిగేవారంటూ ఇండస్ట్రీలో పలు సందర్భాల్లో టాక్స్ వచ్చాయి.


ఆ విధంగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ కత్తిలాంటోడు ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతుంది. లైకా ప్రొడక్షన్స్, రామ్ చరణ్ సంయుక్త భాగస్వామ్యంలో ఈ మూవీ నిర్మితమవుతుంది. అయితే చిరంజీవికి రెమ్యునరేషన్ ఈ మూవీకి భారీగా ఫిక్స్ చేశారు. దాదాపు 23 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ని చిరంజీవి తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. చిరంజీవికి ఇంతటి రెమ్యునరేషన్ ని లిక్విడ్ క్యాష్ రూపంలో కాకుండా, నైజాం ఏరియా రైట్స్ లో భాగంగా కేటాయించినట్టు టాక్స్ వినిపిస్తున్నాయి.


దాదాపు 70 శాతం షేర్ ని నైజాం రైట్స్ లో చిరంజీవి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మూవీ రిలీజ్ అయిన వారం రోజుల్లో హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా నిర్మాతలు చెల్లించే విధంగా అగ్రిమెంట్స్ అయ్యాయని ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న టాక్స్.



మరింత సమాచారం తెలుసుకోండి: