ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాక్స్ గా వినిపిస్తున్న ఫిల్మ్ కత్తిలాంటోడు. మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాగా ఈ మూవీ తాజాగా చిత్రీకరణ జరుపుకుంటుంది. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా హైద్రాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. వరుస షెడ్యూల్స్ ని ప్లాన్ చేసిన వినాయక్ కి చిరంజీవి ఫుల్ సపోర్ట్ గా నటిస్తున్నాడు.


గతంలో చిరంజీవిని ఠాగూర్ లో ఎలా చూపించాడో, ఇప్పుడు అంతకు మించిన లుక్స్ తో చిరంజీవి ఈ కత్తిలాంటోడు మూవీలో కనిపించనున్నాడని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీలో హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలి అనే చర్ఛలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఇక ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నర్గిస్ ఫక్రిని దర్శకుడు వినాయక్ సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


ప్రస్తుతం నర్గిస్ ఫక్రి పారితోషికం బాలీవుడ్ మూవీలో దాదాపు 2 కోట్ల రూపాయలను తీసుకుంటుంది. అలాగే లగ్జరీ సర్వీస్ లను డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు వినాయక్ చేస్తుంది ఏమిటంటే, నర్గీస్ ఫక్రీని రెమ్యునరేషన్ ను తగ్గించుకుని, చిరు మూవీలో నటించాలంటూ చెప్పుకొస్తున్నాడంట.


అయితే చిరంజీవి గురించి నర్గీస్ ఫక్రీ పూర్తిగా వివరాలను తెలుసుకుంటుంది. నర్గీస్ ఫక్రికి రానా మంచి స్నేహితుడు కావటంతో టాలీవుడ్ లో చిరంజీవి ఫాన్ ఫాలోయింగ్ గురించి తెలుసుకుందట. దీంతో రానా సైతం వెంటనే వినాయక్ కి ఓకె చెప్పమని చెప్పాడంటూ టాక్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై త్వరలోనే ఓ ప్రకటన రానుందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: