మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తాజాగా తెరకెక్కించిన మూవీ అఆ. ఇది బాక్సాపీస్ వద్ద మంచి హిట్ ని అందుకుంది. దీంతో త్రివిక్రమ్ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీ ఎవరితో ప్లాన్ చేసుకోవాలి అన్నదాంట్లో ఉన్నారు. అయితే ఇండస్ట్రీ నుండి అందుతున్న సమాచారం ప్రకారం త్రివిక్రమ్ ప్రస్తుతం సూర్యతో కథా చర్ఛలు జరుపున్నాడు.


దీనికి సంబంధించిన చర్ఛలు ఓ కొలిక్కి వచ్చాయా? లేదా? అనే విషయంపై ఇంకా స్పష్టత బయటకు రాలేదు. చాలా మంది త్రివిక్రమ్ నెక్ట్స్ మూవీ కోలీవుడ్ హీరో సూర్యతో ఫిక్స్ అయినట్టుగా టాక్స్ వినిపిస్తున్నాయి. అయితే కొంత మంది మాత్రం సూర్య మూవీ కాన్సిల్ అయింది, పవన్ కళ్యాణ్ సినిమా కోసం త్రివిక్రమ్ స్క్రిప్ట్ ని సిద్ధం చేసుకుంటున్నారని అంటున్నారు.


ఒక వైపు నిర్మాత దిల్ రాజు సైతం త్రివిక్రమ్‌తో చేయబోయే సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటకు చెప్పుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా ఉండేలా చూసుకుంటున్నానని దిల్ రాజు క్లారిటీ ఇచ్చాడు. దీంతో త్రివిక్రమ్ ఏ హీరోతో సినిమాని ముందుగా స్టార్ట్ చేయనున్నారు అనేది సస్పెన్స్ లో ఉంది.


ఒకవైపు కోలీవుడ్ హీరో సూర్యతో అయితే ద్విభాషా చిత్రంగా ఇది పెద్ద చిత్రంగా మారుతుంది. అలా కాకుండా కొంత సమయం తీసుకుని ఏకంగా పవన్ కళ్యాణ్ తో సినిమాని చేస్తే...వీరి కాంబినేషన్ మరోసారి బ్లాక్ బస్టర్ దిశగా పయనిస్తుంది. ఏదైతేనేం, త్రివిక్రమ్ సైతం పవన్ కళ్యాణ్ కాల్షీట్స్ కోసం ప్రయత్నిస్తున్నట్టుగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న రిపోర్ట్స్. 


మరింత సమాచారం తెలుసుకోండి: