అ..ఆ..’ సూపర్  సక్సెస్ తరువాత త్రివిక్రమ్ వంక ఎందరో టాప్ హీరోలు  చూస్తున్నా మాటల మాంత్రికుడు మాత్రం తన ప్రియ స్నేహితుడు పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి డిసైడ్ కావడంతో పవన్ అభిమానులంతా మంచి జోష్ లోకి వెళ్ళిపోయారు. ప్రస్తుతం పవన్ దర్శకుడు డాలీ డైరక్షన్ లో నిర్మింప బడుతున్న ‘కడప కింగ్’ నిర్మాణం పూర్తి అయిన వెంటనే నవంబర్ లేదంటే డిసెంబర్ లో పవన్ త్రివిక్రమ్ ల మూవీ ప్రారంభం అవుతుంది అన్న వార్తలు వస్తున్నాయి. 

అయితే ఈసినిమాకు ఇప్పటి వరకు త్రివిక్రమ్ కు అత్యంత సన్నిహితుడైన ‘అ ఆ’ ప్రొడ్యూసర్ రాధాకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తాడని దీనికి సంబంధించిన అడ్వాన్స్ ను కూడ పవన్ రాధాకృష్ణ నుండి తీసుకున్నాడని వార్తలు వచ్చాయి. త్రివిక్రమ్ తో నిర్మాత రాధాకృష్ణ వరుసగా సినిమాలు చేస్తున్న నేపధ్యంలో త్రివిక్రమ్ తీయబోయే తదుపరి సినిమా కూడ తన బ్యానర్ లోనే ఉంటుందని రాధాకృష్ణ లీక్ లు ఇస్తున్నాడు. 

ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే త్రివిక్రమ్ కూడ పవన్ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ తయారు చేస్తున్నాడు. అయితే త్రివిక్రమ్ ఈ విషయాన్ని ఇంకా కన్ఫాం చేయకపోవడానికి కారణం పవన్ అన్న వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం ఈసినిమా ప్రాజెక్ట్ కు పవన్ కళ్యాణ్ మనసులో వేరే నిర్మాత ఉన్నాడు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ ఇప్పటికే దాసరికి తాను ఒక సినిమాను చేస్తాను అని మాట ఇచ్చిన నేపధ్యంలో దాసరి రాధాకృష్ణ లను సహనిర్మాతలుగా చేసి ఈ మూవీ ప్రాజెక్ట్ ముగిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలలో త్రివిక్రమ్ తో చేయబోయే చిత్రాన్ని దాసరి చేతిలో పెట్టాలని పవన్ ఆలోచనగా తెలుస్తోంది. 

అందుకే తాను ఫైనల్ చేసేవరకూ నిర్మాత పేరు అనౌన్స్ చేయద్దని త్రివిక్రమ్ కు చెప్పాడని టాక్.  పవన్ కళ్యాణ్ మరో మూడు సినిమాలు మించి చేయడు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో పవన్ దాసరికి తాను ఇచ్చిన మాట నిలుపుకోవడం కోసం ఎదో విధంగా రాధాకృష్ణ దాసరిల జాయింట్ మూవీ ప్రాజెక్ట్ గా తాను నటించబోయే త్రివిక్రమ్ సినిమాను మార్చాలని చాల గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ అనుకోని ట్విస్ట్ కు త్రివిక్రమ్ అదేవిధంగా రాధాకృష్ణ ఎలా స్పందిస్తారో అన్న విషయమై రకరాకాల ఊహాగానాలు వినపడుతున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: