కింగ్ నాగార్జున సమంత నాగ చైతన్యల ప్రేమ వ్యవహారం మధ్య నలిగిపోతూ ఉంటే అన్న కు పోటీగా తమ్ముడు అఖిల్ జరుపుతున్న ప్రేమాయణం వార్తలతో పాటుగా అఖిల్ ప్రేయసి వివరాలను ఈరోజు ఒక ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రిక పతాక స్థాయిలో ప్రచురించి మరో సంచలనం రేపింది. ఇప్పటి వరకు అఖిల్ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అనే వార్తలు వచ్చినా ఆ వార్తల పై స్పష్టత రాలేదు.

ఆ ఆంగ్ల దినపత్రిక ప్రచురించిన వివరాల ప్రకారం అఖిల్ ప్రేమిస్తున్న అమ్మాయి భాగ్యనగరానికి చెందిన అమ్మాయి అని తెలుస్తోంది. ఫ్యాషన్ డిజైనర్ గా ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్న ఆఅమ్మాయి అమెరికాలోని న్యూయార్క్ లో చదువుకుంది అని టాక్. అంతేకాదు అఖిల్ గర్ల్ ఫ్రెండ్ కుటుంబం తరతరాలుగా అక్కినేని కుటుంబంతో మంచి సాన్నిహిత్యం కొనసాగిస్తున్నారు అన్న విషయాన్ని కూడ అ ఆంగ్లదినపత్రిక బయట పెట్టింది. 

గత కొంత కాలంగా అఖిల్ తన ప్రేమాయణం కొనసాగిస్తూ మీడియాకు తెలియకుండా అతి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు టాక్. అంతేకాదు మీడియాను పబ్లిసిటీని పెద్దగా ఇష్టపడని ఆ అమ్మాయి అభిప్రాయాన్ని గ్రహించిన అఖిల్ తన ప్రేమాయణాన్ని చాల లో ప్రొఫైల్ లో మెయిన్ టైన్ చేస్తున్నట్లు టాక్. తన తల్లితండ్రుల పై విపరీతమైన ప్రేమను ప్రదర్శించే అఖిల్ తన తల్లిదండ్రుల అంగీకారంతో ఈ ప్రేమ వ్యవహారాన్ని పెద్దలు కుదిర్చిన పెళ్ళిగా మార్చాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

తెలుగు కుటుంబాలు సాంప్రదాయానికి కొన్ని కట్టుబాట్లకు విలువ ఇస్తాయి కాబట్టి వాటికి అనుగుణంగా తన ప్రేమ వ్యవహారం ఉండాలని అఖిల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అఖిల్ తాను ప్రేమిస్తున్న అమ్మాయిని నాగ్ అమలలకు పరిచేయడమే కాకుండా తన ప్రేమ వ్యవహారాన్ని తన తల్లితండ్రులకు స్పష్టంగా చెప్పినట్లు ఆ ఆంగ్ల దిన పత్రిక కథనం. ఏది ఎలా ఉన్నా ప్రస్తుతం మీడియా అంతా ప్రతిరోజు నాగార్జున కొడుకుల ప్రేమ వ్యవహారాల గురించి వార్తలతో నిండి పోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది..  



మరింత సమాచారం తెలుసుకోండి: