తెలుగు,తమిళ,హిందీ ఇండస్ట్రీలో చాలా కొద్ది మంది నటులకు మాత్రమే పూర్తి స్థాయిలో ఇమేజ్ దక్కుతుంది..అలాంటి వారిలో అమితాబచ్చన్, రజినీకాంత్,కమల్ హాసన్, చిరంజీవి లాంటి వారు చాలా కొద్దిమంది ఉంటారు. ఇక రజినీకాంత్ అయితే ఒక్క భారత దేశంలోనే కాకుండా మలేషియా, సింగపూర్,జపాన్ లాంటి దేశాల్లో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. ఒకదశలో ఇక్కడి కంటే అక్కడే ఆయన సినిమాలు విపరీతంగా ఆడతాయన్నదానిలో అతిశయోక్తి లేదు. తాజాగా రజినీకాంత్ ‘కబాలి’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే..అయితే ఈ చిత్రంలో రజినీకాంత్ తన వయసులో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో అప్పట్లో ఎలాంటి కాస్ట్యూమ్స్ వేసుకున్నాడో అలా కనిపిస్తున్నాడు. దీంతో తమిళ తంబీలకు మరింత ఉత్సాహం ఎక్కువైంది..అలాంటి స్టైల్ ఎన్నాళ్ల తర్వాత చూస్తున్నామన్న కుతూహలం బాగా పెరిగిపోయింది.

కబాలి చిత్రంలో రజినీకాంత్


అయితే ఈ చిత్రం పూర్తి స్థాయిలో సెంటిమెంట్, మాఫియా నేపథ్యంలో కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. అంతే కాదు రజినీకాంత్ ఇప్పుడు ఎలా ఉన్నాడో నేచురల్ గా అలాగా గడ్డం పెంచుకొని కనిపిస్తున్నారు. కానీ ఆయన స్టయిల్ యాక్టింగ్ మరింత ఉత్సాహంగా కనిపిస్తుంది. స్టార్ రజనీకాంత్ నటించిన ‘కబాలి’ చిత్ర ఆడియో వేడుక తమిళంలో ఇప్పటికే రిలీజ్ కాగా, తాజాగా తెలుగులోను ఈ సినిమా పాటలను విడుదల చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియే వేడుకలు చాలా సింపుల్ గా జరిగాయి.


హైద్రాబాద్‌లోని జే.ఆర్.సీ కన్వెన్షన్ సెంటర్‍లో కబాలి తెలుగు ఆడియో వేడుక కార్యక్రమం జరగగా, రజనీ మినహా మిగతా టీమ్ అంతా ఆడియో వేడుకకి హాజరు అయినట్టు తెలుస్తోంది. వరుణ్ తేజ్, బి.గోపాల్, పరచూరి గోపాలకృష్ణ, కోదండరామిరెడ్డి లాంటి పలువురు తెలుగు సినీ ప్రముఖులు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ఇక దర్శకుడు పా రంజిత్ తెరకెక్కించిన కబాలి చిత్రంలో రాధికా ఆప్టే, ధన్సిక ప్రధాన పాత్రలు పోషించారు. జూలై 15న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో కబాలి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: