తెలుగు ఇండస్ట్రీలో వారసుల హవా కొనసాగుతున్న సమయంలో గతంలో విలన్ పాత్రలు పోషించి ఇప్పుడు మంచి క్యారెక్టర్ పాత్రలు పోషిస్తున్న చలపతి తనయుడు రవిబాబు దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. విదేశాల్లో విద్యాభ్యాసం, సినిమాలకు సంబంధించిన కోర్సు పూర్తి చేసుకొని తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. వస్తూ వస్తూనే అందరినీ కడుపుబ్బా నవ్వించే  ‘అల్లరి’ చిత్రాన్ని తీసి ఓ అల్లరోడిని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు..ఆ అల్లరోడే నరేష్. ఈ చిత్రం కామెడీ పరంగా వందశాతం మెప్పించింది. తర్వాత కామెడి, ల‌వ్‌, హ‌ర్ర‌ర్‌, సస్పెన్స్ థ్రిల్ల‌ర్ చిత్రాల‌ను ప‌రిమిత బ‌డ్జెట్‌లో తెర‌కెక్కించి డైరెక్ట‌ర్‌గా త‌న‌కంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ద‌ర్శ‌కుడు ర‌విబాబు. కేవలం డైరెక్టర్ గానే కాకుండా ఎన్నో విభిన్నమైన పాత్రలు వేస్తూ కామెడీ గా నవ్విస్తున్నాడు.

ఎప్పుడూ విభిన్నమైన చిత్రాలు తీసే రవిబాబు ఈసారి కొత్త ప్రయోగం చేస్తున్నాడు అదే.. పంది పిల్లపై ఓ సినిమా తీసాడు. ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. పందిపిల్ల ఎలా ప్ర‌వ‌ర్తిస్తుంది అనే దానిపై స్ట‌డీ చేసిన రవిబాబు యానీమెట్రిక్ సాఫ్ట్‌వేర్‌తో సినిమాను తెరకెక్కించాలనుకున్నాడు. కాని అది ఉప‌యోగించాలంటే చాలా ఖ‌ర్చుతో కూడుకున్న ప‌నికావ‌డంతో సిలికాన్‌తో పందిపిల్ల మోడ‌ల్‌ను త‌యారుచేశారు. అలాగే రియ‌ల్‌గా చిత్రీక‌రించ‌లేని కొన్ని షాట్స్‌ను యానీమెట్రోనిక్స్ సాఫ్ట్‌వేర్‌ను ఉప‌యోగించి విజువ‌ల్ ఎఫెక్ట్స్‌లో క్రియేట్ చేశామన్నారు.

మార్చిలో సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్ మూడు నెల‌ల్లో ప్యాకప్ చెప్పేశారు. పందిపిల్ల ప్ర‌ధాన‌పాత్ర‌లో రూపొందుతోన్న ఈ చిత్రంలో అభిషేక్‌, నాభ లీడ్ రోల్స్ చేస్తున్నారు. గతంలో రాజమౌళి ఈగ పై చేసిన ప్రయోగం ఏంత గ్రాండ్ సక్సెస్ అయ్యిందో అందరికీ తెలుసు..ఇప్పుడు  ఈ చిత్రం అందరిలో కాస్త ఎగ్జైట్ మెంట్ ని క్రియేట్ చేస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: