యంగ్ టైగర్ ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అయితే తనతో నటించే సహనటుల విషయంలో కూడా ఎంతో జాగ్రత్తగా ఉండే తారక్ ఈ మధ్య ఓ సినిమాలో హీరోయిన్ నటన చూసి ఫిదా అయ్యాడట. అంతేకాదు ఆమెను తన తర్వాత సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలని దర్శకుడికి చెప్పాడట. ఇంతకీ జూనియర్ మనసు దోచిన ఆ భామ ఎవరంటే.


జెంటిల్ మన్ సినిమాలో కేథరిన్ గా నటించిన నివేదా థామస్.. సినిమ మొత్తం నడిపించింది నాని తర్వాత నివేదానే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక రీసెంట్ గా జెంటిల్ మన్ సినిమా చూసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ నివేదా నటనను మెచ్చాడట. స్క్రీన్ ప్రెజెన్స్ లో అద్భుతంగా ఉన్న ఆమెను తను తర్వాత చేయబోయే వక్కంతం వంశీ సినిమాలో హీరోయిన్ గా తీసుకోనున్నారని అంటున్నారు.  


మరి జూనియర్ మనసు గెలిచింది అంటే నివేదాకు లక్కీ ఆఫర్ తగిలినట్టే.. సహజ నటనతో అందరిని ఆకట్టుకుంటున్న నివేదా మొదటి సినిమాతోనే మరో అభినయ తారగా ప్రేక్షకుల నుండి నీరాజనాలు అందుకుంది. నానికి ఏమాత్రం తగ్గకుండా ఆమె నటన సింప్లీ సూపర్బ్. ఇక జెంటిల్ మన్ లో సురభి కూడా ఆకట్టుకుంది. నాని మోహనకృష్ణ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక జెంటిల్ మన్ సినిమా హైలెట్స్ చెబితే మ్యూజిక్ పనితనం మణిశర్మ చేసిన మ్యాజిక్ అందరు ఆశ్వాదించారు. 


తారక్ విషయానికొస్తే జనతా గ్యారేజ్ దాదాపు తుది దశకు వచ్చింది.. ఓ పక్క పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా స్టార్ట్ చేసేశారు.. గ్యారేజ్ రిలీజ్ ఆగష్టు 12న ఫిక్స్ చేశారు. ఇక వక్కంతం వంశీ దర్శకత్వంలో ఎన్టీఆర్ అక్టోబర్ లో సినిమా స్టార్ట్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంలో నందమూరి కళ్యాన్ రాం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: