సౌత్ సూపర్ స్టార్ రజిని అంటే తమిళంలోనే కాదు తెలుగులో కూడా సూపర్ క్రేజ్.. ఇక్క చాలామంది స్టార్స్ కు రజిని ఇష్టమైన హీరోగానే కాదు స్పూర్తిగా కూడా ఉంటాడు. ప్రస్తుతం కబాలిగా పంజా విసరడానికి వస్తున్న రజినికాంత్ ఆ సినిమా తెలుగు ఆడియో నిన్న హైదరబాద్ లో జరిగింది. గెస్ట్ లుగా నాని, వరుణ్ తేజ్ లతో పాటు ముఖ్య అతిధులు వచ్చారు.


సినిమాను తెలుగులో షణ్ముఖ క్రియేషన్స్ బ్యానర్లో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ ఆడియో వేడుకలో నాని రజిని సినిమాల గురించి మాట్లాడటం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. తాను రజినికి ఎంత పెద్ద ఫ్యానో అంటూ మొదలు పెట్టిన నాని కబాలి ఆడియోకి ఈ స్టేజ్ మీద ఉండటం తన లక్ అన్నాడు. ఇక అందరు కబాలి రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నా.


నా విషానికొస్తే శంకర్ గొప్ప దర్శకుడే కాని కబాలి గురించే అందరు ఎదురుచూస్తున్నారు.. కబాలి సినిమాలో మరోసారి భాషా మార్క్ సూపర్ స్టార్ ను మనం చూడబోతున్నాం అంటున్నారు. ఆ స్టైల్ కోసం సినిమా కోసం అందరు ఎదురుచూస్తున్నారు. ఇక ఆడియో విడుదలకు టి.సుబ్బిరామిరెడ్డి కూడా వచ్చారు. రజిని సినిమాల గురించి చెబుతూ ఆయన ఎంత పెద్ద స్టారో అంత మంచి మనిషని అన్నారు.


ఇక నాని జెంటిల్ మన్ సినిమా గురించి ప్రస్థావించిన సుబ్బిరామిరెడ్డి జూనియర్ రజినికాంత్ నాని అని సంచలనం సృష్టించాడు. మరి నాని జూనియర్ రజిని అవునో కాదో తెలియదు కాని కబాలి ఆడియోలో నాని చేసిన సందడి చూస్తుంటే నానికి రజిని మీద ఉన్న అభిమానం తెలియచేస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: