‘సోగ్గాడే చిన్ని నాయన’ ‘ఊపిరి’ వరస హిట్స్ తరువాత నాగార్జున కొంత టైమ్ గ్యాప్ తీసుకుని ఇప్పుడు శ్రీవేంకటేశ్వర స్వామి భక్తుడు హాథీరామ్ బాబాగా కనిపించడానికి తన లుక్ ను మార్చుకుని షూటింగ్ కు సిద్ధం అవుతున్న సమయంలో ఈసినిమాకు ఊహించని సమస్యలు ఎదురౌతున్నాయి అన్న వార్తలు హడావిడి చేస్తున్నాయి.
ఈమధ్యనే నాగార్జున రాఘవేంద్రరావు తో కలిసి ఈసినిమాకు సంబంధించి తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామి సన్నిధిలో పూజలు కూడ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. 

అయితే ఈ పరిస్తుతులలో ఈసినిమాకు సమస్యలు ఏర్పడ్డాయి అంటూ వార్తలు రావడానికి ఒక కారణం ఉంది అని  అంటున్నారు. ఫిలిం నగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం తిరుమలలో ఉన్న హాథీ రామ్ బాబా మఠం నిర్వాహకులు తమ అనుమతి లేకుండా ఈసినిమాను ఎలా తీస్తారు అని ప్రశ్నిస్తున్నట్లు టాక్.

అంతేకాదు ఈ మఠానికి చెందిన ఒక ముఖ్య వ్యక్తి ఈ సినిమా స్క్రిప్ట్ ను తమ అనుమతి లేకుండా రాఘవేంద్రరావు సినిమాగా తీస్తే తాము కోర్టులకు వెళ్ళడానికి కూడ వెనకడుగు వేయము అని ఈసినిమా దర్శక నిర్మాతలకు సందేశాలు పంపుతున్నట్లు టాక్. అయితే ఈసినిమా దర్శకుడు రాఘవేంద్ర రావు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ మెంబర్ గా ఉన్న నేపద్యంలో ఈ చిన్న సమస్య సులువుగానే పరిష్కారం అవుతుందని ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల ఎంపిక కూడ పూర్తి అయిన నేపధ్యంలో ఈ చిన్న సమస్య పెద్దదిగా మారకుండా త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కావాలని నాగ్ అభిమానులు కోరుకుంటున్నారు. అంతేకాదు ఒక అన్నమయ్య రేంజ్ లో ఈ సినిమా హిట్ అవుతుందని ఈ సినిమా పై అప్పుడే పాజిటివ్ టాక్ ఫిలింనగర్ లో వినపడుతోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: