సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఫిల్మ్ కెరీర్ ని కొనసాగిస్తున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ పలు సినిమాలతో బిజిగా ఉంటుంది. ఒక్క సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ మాత్రమే కాకుండా, ఇటు బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కాజల్ అగర్వాల్ సత్తా చాటుతుంది. ‘సర్దార్ గబ్బర్ సింగ్’, ‘బ్రహ్మోత్సవం’ వంటి క్రేజీసినిమాలు చేసినప్పటికీ కాజల్ అగర్వాల్ సరైన సక్సెస్ అనేది అందుకోలేకపోయింది.

ఇందుకు కారణం కథలు అయినప్పటికీ...ఈ ఎఫెక్ట్ ఈ బ్యూటీ పై పడింది. అలాగే తాజాగా బాలీవుడ్ లో వచ్చిన ‘దో లఫ్జోంకీ కహానీ’ మూవీ తనకి సక్సెస్ ని ఇవ్వలేదు. దీంతో కాజల్ అగర్వాల్ కి మార్కెట్ లో కొంత డిమాండ్ పడిపోయిందని అంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటి తన లవర్ కి బ్రేక్ అప్ చెప్పిందని అంటున్నారు.

బెంగుళూరుకి చెందిన వజ్రాల వ్యాపారితో గత కొంత కాలంగా కాజల్ అగర్వాల్ రిలేషన్ ని మెయింటెన్ చేస్తుందనే టాక్స్ అక్కడ వినిపించాయి. వీరిద్దరూ కలిసి విదేశాలకి సైతం పర్యటనకు వెళ్ళానినే బిటౌన్ లో వినిపిస్తున్న న్యూస్. అయితే రెండు సంవత్సరాలుగా ఉన్న వీరి పరిచయం ఇప్పుడు ఒక్కసారిగా బ్రేక్ జరిగిందని అంటున్నారు.

ఇందుకు పలు కారణాలు ఉన్నాయి. ఏదైతేనేం, ప్రస్తుతం కాజల్ అగర్వాల్ తన లవర్ తో తీసుకున్న బ్రేక్ అప్ కారణంగా ఫుల్ జోష్ తో ఉందని అంటున్నారు. అలాగే తను సినిమాలకి గుడ్ బై చెప్పేస్తుందన్న వార్తలకి సైతం ఈ బ్యూటి స్పందించి అలాంటిదేమి లేదని క్లారిటీ ఇచ్చింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: