ఈ మద్య సినిమా ఇండస్ట్రీకి చెందిన హాస్యనటులు చాలా మంది ఆకస్మికంగా కాలం చేయడం ఎంతో దుఖాఃనికి గురిచేసింది. తాజాగా మరో హాస్య నటి గుండెపోటుతో మృతి చెందారు.  ఉపేంద్ర హీరోగా నటించిన ఉపేంద్ర చిత్రంలో మారిముత్తు సరోజమ్మ హఠాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు. ఉపేంద్ర చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న సరోజమ్మ విలన్ క్యారెక్టర్ గా కామెడీతో ఆకట్టుకుంది. సరోజమ్మ కన్నడంలోనే కాకుండా తమిళ చిత్రాల్లో కూడా నటించింది.

అయితే సరోజమ్మ గత కొంత కాలంగా అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది. బెంగుళూరులోని కమలానగర్‌లో సరోజమ్మ నివసిస్తున్నారు. అయితే ఆమెకు  ఒక్కసారిగా అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ట్రీట్‌మెంట్ నడుస్తున్న సమయంలో కమలమ్మకు హార్ట్ స్ట్రోక్ వచ్చిందని సన్నిహితులు చెబుతున్నారు. సరోజమ్మ మృతి పట్ల పలువురు సీనీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: