మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా షూటింగ్ రీసెంట్ గా స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే.. కోలీవుడ్ కత్తికి పదును పెట్టి మరి సినిమా సిద్ధం చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు. వినాయక్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో ఇంకా ఓ క్లారిటీ రాలేదు. అనుష్క, నయనతార అంటూ హడావిడి చేసి చివరకు ఓ బాలీవుడ్ బ్యూటీని ఈ సినిమా కోసం రంగంలో దించేలా చేస్తున్నారు. 


ఇక బీ టౌన్ బ్యూటీల్లో కూడా మొన్నటిదాకా దీపికా పదుకునే అన్న చిత్రయూనిట్ ఇప్పుడు బికిని బ్యూటీ నర్గీస్ ఫక్రి కోసం ప్రయత్నాలు చేస్తున్నారట.బీ టౌన్ లో హాట్ ఇమేజ్ తో అదరగొడుతున్న నర్గీస్ చిరు సినిమాలో ఉంటే ఆ క్రేజే వేరులా ఉంటుంది. ఎప్పుడో వర్మ సినిమాలో ఓ ఐటం సాంగ్ చేసిన ఈ అమ్మడు ఆ తర్వాత తెలుగులోనే కాదు సౌత్ సినిమాల్లో చేయలేదు. 


కాని ఇప్పుడు నర్గీస్ ను చిరు కత్తిలాంటోడు కోసం హీరోయిన్ గా చేసే ప్రయత్నాలు చేస్తున్నారట. ఇప్పటికే దర్శకుడు వినాయక్, నిర్మాత రాం చరణ్ ఆమెతో డిస్కషన్ మొదలు పెట్టారట. ఇక నర్గీస్ రెస్పాన్స్ కోసం ఎదురుచూస్తున్నారట. ఒకవేళ ఆమె ఓకే అంటే కచ్చితంగా సినిమాకు గ్లామర్ పరంగా చిరు 150వ సినిమా అదరిపోయినట్టే లెక్క.  


అంతేకాదు సినిమాలో నర్గీస్ ఉంటే కేవలం ఎంటర్టైన్ మెంట్ తో పాటుగా సమపాళ్ళలో రొమాన్స్ కూడా ఉంటుందనే ఆలోచనతో ఆమెను తీసుకుంటున్నారు. చిరుతో సరైన హిట్ కొడితే నర్గీస్ కు ఇక సౌత్ లో నీరాజనాలు అందినట్టే. బాలీవుడ్లో హాట్ ఇమేజ్ ఉన్నా టాప్ రేంజ్ కు వెళ్ళలేని ఈ బ్యూటీ కాన్సంట్రేట్ చేస్తే కచ్చితంగా సౌత్ లో స్టార్ క్రేజ్ సంపాదించుకునే అవకాశం ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: