టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మెగా హీరోల దూకుడు ఎక్కువుగా ఉందనే చెప్పాలి. మొన్నటి వరకూ ఇద్దరు, ముగ్గురు ఉన్న మెగాహీరోలు ఇప్పుడు చిన్న సైజు క్రికెట్ టీంలా మారారు. ఇది చాలదు అన్నట్టుగా హీరోయిన్స్ విషయంలోనూ మెగా ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీకి పోటీ ఎదురవుతుంది. మెగాహీరోయిన్ నిహారికా తాజాగా ఒకమనస్సు చిత్రం ద్వారా ఎంట్రి ఇచ్చి, ప్రేక్షకుల మెప్పుని పొందింది.


ఇదిలా ఉంటే ప్రస్తుతం మెగా ఫ్యామిలీ లొ జెట్ స్పీడ్ తో దూసుకువస్తున్న హీరో సాయిధరమ్ తేజ్. సాయిధరమ్ తేజ్ బాడీ లాంగ్వేజ్ అన్నీ కథా చిత్రాలకి సరిపడా ఉండటంతో...తనకి ఈ మధ్య కాలంలో మంచి మంచి కథలు వస్తున్నాయి. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ హీరోగా సునీల్ రెడ్డి దర్శకత్వంలో 'తిక్క' సినిమా వస్తుంది.


సాయిధరమ్ తేజ్ వరుస విజయాలతో ఉండటం వలన తిక్క మూవీ సైతం మంచి సక్సెస్ ని సాధిస్తుందని అంటున్నారు. ఒక వేళ తిక్కమూవీ గ్రాండ్ సక్సెస్ ని సాధించిందంటే సాయిధరమ్ తేజ్ కి మార్కెట్ లో భారీ డిమాండ్ ఏర్పడటం ఖాయం. అలా జరిగితే ప్రస్తుతం మార్కెట్ లో డల్ గా ఉన్న రామ్ చరణ్ మరింత వీక్ అయ్యే ఛాన్స్ ఉంది.


సరిగ్గా చిరంజీవికి ఉన్న బాడీ లాంగ్వేజ్ సాయిధరమ్ తేజ్ లో ఉండటంతో...రామ్ చరణ్ కి పడాల్సిన సినిమాలు అన్నీ సాయిధరమ్ తేజ్ వైపు వెళుతున్నాయి. ఇదే భవిష్యత్ లో కొనసాగితే...చరణ్ కంటే సాయిధరమ్ తేజ్ కే ఎక్కువ సక్సెస్ రేటు రావటం ఖాయం అని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: