మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం 'కత్తిలాంటోడు'. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా చిత్రీకరణ జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ మూవీలో రోజుక ప్రత్యేక బయటకు వస్తుంది. మెగాప్యామిలీ కి సంబంధించిన అందరి హీరోలు చిరంజీవి నటిస్తున్న 150వ సినిమాలో కనిపించనున్నారు.

ఇంతటితో ఆగకుండా, మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సైతం 'కత్తిలాంటోడు' మూవీలో తనవంతుగా చేతులు కలుపుతుంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత ఈ చిత్రంలో, మెగాస్టార్ కి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తున్నట్టు ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్స్. అయితే అందకు సుస్మిత ఎటువంటి ఛార్జ్ ని చేయటం లేదని అంటున్నారు.

కేవవం తన తండ్రి 150వ మూవీ అయిన'కత్తిలాంటోడు' లో తనూ పనిచేయాలని నిర్ణయించుకున్నానని చెబుతుందట. అయితే సుస్మిత గతంలో చిరంజీవి నటించిన కొన్ని చిత్రాలకు కాష్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశారు. 'నిఫ్ట్'లో చదువుకున్న సుస్మిత, 'జై చిరంజీవ', 'శంకర్ దాదా జిందాబాద్'వంటి చిత్రాలకి కాస్ట్యూమ్స్ డిజైనర్ గా పనిచేశారు.

అందుకే చిరు 150వ మూవీలోనూ కాస్ట్యూమ్స్ డిజైనర్ గా పనిచేసి మరింత పేరు తెచ్చుకున్నాక, తను ఇతర సినిమాలకి సైతం పనిచేయాలని భావిస్తున్నారంట. ఇక తన కాష్ట్యూమ్స్ డిజైన్స్ చేస్తున్నందుకు రెమ్యునరేషన్ తీసుకోవాల్సిందిగా చిరు చెప్పినప్పటికీ...సుస్మిత నో అని చెప్పటం విశేషంగా మారింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: