సౌత్ బ్యూటీ సమంత ప్రవర్తన ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్ అయ్యింది. ఓ పక్క సినిమాల జోరులో ఉన్న అమ్మడు మరో పక్క యువ హీరో నాగ చైతన్యతో లవ్ లో ఉందన్నది ఓపెన్ టాక్. ఇద్దరు చట్టాపట్టలేసుకు తిరుగుతున్నారు కాని బయట మాత్రం పడట్లేదు. ఇక సమంత ప్రస్తుతం చేస్తున్న సినిమాలు జనతా గ్యారేజ్ తప్ప మరేది లేదు.


ఇక నాగ చైతన్యతో సోగ్గాడే చిన్ని నాయనా సినిమా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ డైరక్షన్లో ఓ సినిమా కమిట్ అయ్యింది. అయితే ఇక కమిట్ అయిన సినిమాల తప్ప కొత్తగా మరే సినిమాకు సమంతను అడిగితే ఏం మాట్లాడట్లేదు అంట.. మరి సినిమాలకు ఎందుకు సమంత సైన్ చేయట్లేదు అన్నది అర్ధంకాని కన్ ఫ్యూజన్.


ఇక దీనికి కారణం చైతు సమంతల మధ్య మీడియాలో మరీ హాట్ టాపిక్ కావడంతో కొద్ది గ్యాప్ తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. జనతా గ్యారేజ్ సినిమా తర్వాత సమంత మరోసారి గ్యాప్ తీసుకోనుంది అన్నది లేటెస్ట్ అప్డేట్. అంతేకాదు తన పర్సనల్ విషయాల పట్ల ఈ వ్యవహారాలు సన్నిహితులతో కూడా షేర్ చేసుకోవట్లేదట.


ఇన్నాళ్లు సౌత్ లో క్రేజీ బ్యూటీగా అభిమానులను అలరించిన సమంత అప్ కమింగ్ సినిమాలపై వస్తున్న రూమర్స్ నిజమేనంటూ చెప్పుకుంటున్నారు. ఓ టైంలో సమంత కొన్నిసార్లు తాను రెండు మూడు సినిమాలకు మించి చేయనని చెప్పిన సందర్భాలు ఉన్నాయి.. మళ్లీ అ ఆ తర్వాత మాత్రం మ్యారేజ్ కు కొద్దిగా టైం ఉందన్నట్టు చెప్పింది. మరి సమంత మాటల అర్ధం ఏమై ఉంటుందా అన్నది ఆమె చెబితేనే తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: