ఫ్యామిలీ హీరోగా పేరు ప్రఖ్యాతలను సంపాదించి సడెన్ గా కెరియర్ ఎండ్ అవుతుంది అనుకున్న టైంలో విలన్ గా రీ ఎంట్రీ ఇచ్చి షాక్ ఇచ్చిన జగపతి ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ విలన్ గా తయారయ్యాడని చెప్పాలి. విలన్ కు మరో డెఫినిషన్ అయ్యేలా తన యాటిట్యూడ్ తయారయ్యింది. అంతేకాదు ఇప్పుడు తను చేస్తుంది స్టార్ హీరోల సినిమాలు కాబట్టి సినిమాలో తన పార్ట్ వరకు పర్ఫెక్ట్ గా ఉండాలని హార్డ్ వర్క్ చేస్తూ మంచి క్రేజ్ సంపాదిస్తున్నాడు.


లెజెండ్ తో విలన్ గా మారిన జగ్గు భాయ్ శ్రీమంతుడులో తండ్రి పాత్ర వేశాడు. ఇక నాన్నకు ప్రేమతోలో మరోసారి స్టైలిష్ విలన్ గా చేసి వారెవా అనిపించాడు. అయితే నాన్నకు ప్రేమతోలో యంగ్ టైగర్ తో పోటీ పడి విలనిజం ప్రదర్శించిన జగపతి సినిమాలో విలన్ కూడా కెక అనుకునేలా చేశాడు. తన మార్క్ మేనరిజాలతో సినిమాలో చేస్తుంది విలన్ రోలే అయినా దానికి వన్నె తెస్తున్నాడు.


అయితే నాన్నకు ప్రేమతోలో తారక్ తో విలన్ గా నటించిన జగపతి బాబు మరోసారి ఎన్టీఆర్ మీద కత్తి దూసేందుకు రెడీ అవుతున్నాడు. అదేనండి మరోసారి ఎన్టీఆర్ తో విలన్ గా నటిస్తున్నాడట. ప్రస్తుతం జనతా గ్యారేజ్ చేస్తున్న తారక్ ఆ సినిమా తర్వాత చేసే వక్కంతం వంశీ సినిమాలో విలన్ రోల్ కూడా చాలా విశిష్టతో కూడుకున్నదట. అయితే ఆ రోల్ లో జగ్గు భాయ్ ను పెట్టే ఆలోచనలో ఉన్నాడట వంశీ.    


ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చలు జరగడం అయ్యింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంలో కళ్యాణ్ రాం నిర్మించబోయే ఈ సినిమాలో తారక్ తో మరోసారి డీ అంటే డీ అంటున్నాడు జగ్గు భాయ్. మరి విలనిజంలో సరికొత్త విధానాలను ప్రవేశ పెడుతున్న జగపతికి ఈ సినిమా కూడా ఓ మైల్ స్టోన్ మూవీగా నిలవాలని ఆశిద్దాం. 


మరింత సమాచారం తెలుసుకోండి: