‘జనసేన’ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చే నెల 9న బ్రిటన్ వెళుతున్న విషయం తెలిసిందే. లండన్ లో ప్రవాసాంధ్రులు నిర్వహించే ఒక కార్యక్రమం కోసం పవన్ ఈ ట్రిప్ ప్లాన్ చేసాడు అనే  వార్తలు వస్తున్నా పవన్ చేస్తున్న ఈ విదేశీ పర్యటన వెనుక ఒక గోల్ ఉంది అన్న ప్రచారం జరుగుతోంది.  

యునైటెడ్ కింగ్ డమ్ ఆఫ్  తెలుగు అసోసియేషన్ (యుక్తా) ఆధ్వర్యంలో జరిగే జయతే కూచిపూడి ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి చీఫ్ గెస్టుగా పవన్ హాజరవుతున్నాడు అలాగే ట్రోక్సీలో జరిగే ఆరో వార్షికోత్సవానికి కూడా పవన్ అటెండ్ అవుతున్నాడు.  అంతేకాదు యుకె, యూరప్ దేశాల్లో పవన్  ఫ్యాన్స్ ఏర్పాటు చేసే ముఖాముఖి ప్రోగ్రాంలో కూడా పవన్ పాల్గొని వారితో మమేకం కానున్నాడు. 

సహజంగా డ్యాన్స్ అంటే ఆమడ దూరం ఉండే పవన్ డ్యాన్స్ కి సంబంధించిన ఒక ఈవెంట్ లో పాల్గొనడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.   అయితే పవన్ కి సాంప్రదాయ నృత్యాలంటే అమితమైన ఆసక్తి గౌరవం ఉన్న నేపధ్యంలో కూచిపూడి ఉత్సవంలో పాల్గొనేందుకు లండన్ వెళ్తున్నాడు పవన్ కళ్యాణ్. సన్నిహితులు అంటున్నారు. పైకి కూచిపూడి నృత్య కళాకారుడు వేదాంతం వెంకటచలపతి తన ట్రూప్ తో నిర్వహించే ‘భామాకలాపం’ ‘భక్త ప్రహ్లాద’ నృత్య నాటకాలను చూసి వాటిని ప్రోత్సహిద్దామని యుకె వెళుతున్నాడని  ప్రచారం జరుగుతోంది.

అయితే  పవన్ యుకె తో పాటుగా స్విడ్జర్లాండ్ ఐర్ల్యాండ్ ఇటలీ ఫ్రాన్స్ నెదర్ లాండ్స్ దేశాలకు కూడ పవన్ వెళ్ళడం వెనుక ఒక మిషన్ ఉండి అంటున్నారు. 2019 ఎన్నికలో పవన్ తన ‘జనసేన’ తరుఫున పోటికి దిగడం ఖాయం అయిన నేపధ్యంలో ‘జనసేన’ కు విదేశాలలోని తన అభిమానుల సహాయ సహాకారాలు అన్ని విధాలా పొందేవిధంగా కూడ  పవన్ ఈ యుకె, యూరప్ ట్రిప్ చేపట్టాడు అంటూ విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు. ఇదిఇలా ఉండగా  పవన్  డాలి దర్శకత్వంలో లేటెస్ట్ సినిమా షూటింగ్ పవన్. యుకె, యూరోప్ నుంచి తిరిగి వచ్చాక ప్రారంభం అవుతుంది అని టాక్.. 



మరింత సమాచారం తెలుసుకోండి: