విమర్శకుల చేత తీవ్రంగా టార్గెట్ చేయబడ్డ ‘ఒక మనసు’ సినిమాను నిలబెట్టడానికి మెగా అభిమానులను సమాయక్తం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈసినిమాకు మొదటిరోజు మొదటి షోకు మంచి ఓపెనింగ్స్ రావడానికి మెగా అభిమానులు ఎంతగానో కృషి చేసిన విషయం తెలిసిందే. 

అయితే సినిమాకు వచ్చిన నెగిటివ్ టాక్ రీత్యా మెగా అభిమానులు కూడ చేతులెత్తేశారు. కాని నిన్న వర్కింగ్ డే సోమవారం అయినప్పటికీ ఎ క్లాస్ సెంటర్లలో ముఖ్యంగా మల్టీఫ్లెక్స్ ధియేటర్లలో ఈసినిమాకు డీసెంట్ కలక్షన్స్ రావడంతో మెగా కాంపౌండ్ కు మళ్ళీ ఆశలు చిగురించాయి. కనీసం ఎవరేజ్ సినిమాగా అయినా ఒక మనసును మార్చాలని మెగా అభిమానులు ముఖ్యంగా చిరంజీవి వీరాభిమానుల సహకారాల కోసం ఈసినిమా నిర్మాతలు ప్రయత్నిస్తున్నట్లు టాక్.

ఈసినిమాకు 14 నిముషాల ఎడిటింగ్ జరిగిన తరువాత ఈసినిమాను చూసిన ఫ్యామిలీ ఆడియన్స్ ఈసినిమా పై కొంత వరకు సంతృప్తి వ్యక్త పరుస్తున్న పరిస్థుతులలో ఈ సినిమా ప్రమోషన్ ను మరికొన్ని రోజులు కొనసాగించి ఈ సినిమాను ఫ్లాప్ నుండి బయట పడేయాలని ఈసినిమా నిర్మాతలు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ వార్తలు ఇలా ఉండగా ఈసినిమాకు ఓవర్ సీస్ తో కలిపి గత నాలుగు రోజులలో సుమారు 2.25 కోట్ల వరకు కలక్షన్స్ వచ్చాయి అన్న వార్తలు వస్తున్నాయి. ఈసినిమా విడుదలకు ముందు 5 కోట్ల బిజినెస్ జరిగిన నేపధ్యంలో ఈసినిమా నిర్మాతలకు భయంకరమైన నష్టాలు ఉండవు అన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈసినిమా విడుదలకు ముందు జెమిని ఛానల్ 2.50 కోట్ల మొత్తానికి శాటిలైట్ రైట్స్ ఇమ్మని అడిగినా ఈసినిమా నిర్మాతలు ఈ సినిమా పై ఉండే అతి నమ్మకంతో శాటిలైట్ రైట్స్ అమ్ముకోకుండా తమ వద్దనే ఉంచు కోవడంతో ఇప్పుడు ఈ సినిమా ఛానల్ రైట్స్ గురించి ఏ ఛానల్ ప్రయత్నించ దు అన్న వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థుతులలో మెగా అభిమానుల ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: