టీవీ 9 - మధుర శ్రీధర్ నిర్మాణం లో నిహారిక డెబ్యూ సినిమాగా వచ్చిన ' ఒక మనసు ' ప్రస్తుతం థియేటర్ లలో రన్ అవుతోంది. టీవీ9 నిర్మాణం కావడం తో పబ్లిసిటీ విషయం లో చూసుకోనక్కర లేదు. అయితే సినిమా విడుదల సమయం నుంచీ మార్నింగ్ షో తర్వాత భారీగా నెగెటివ్ రివ్యూ లు వచ్చేసాయి. సో సినిమా భవిష్యత్తు ఏంటి రెవెన్యూ లో ఎంతవరకూ ప్రాఫిట్ వస్తుంది అనేది సందేహమే. ఈ సినిమాని ఓవర్ సీస్ హక్కులతో కలిపి దాదాపు ఐదున్నర కోట్లకి అమ్మేసారు.

 

 మొదటి మూడు రోజుల కలక్షన్ చూసుకుంటే కోటీ డబ్భై ఐదు లక్షల వరకూ తేలింది. మల్టీ ప్లక్స్ లలో ఎదో నడుస్తోంది కానీ సింగల్ థియేటర్ లలో చాలా ఇబ్బందికర పరిస్థితి. నిన్న అంటే సోమవారం సినిమాలు సాధారణంగా డ్రాప్ అవుతూనే ఉంటాయి కానీ మంగళవారం ఎలా నడుస్తుంది అనేదాని బట్టి ఈ వారంతం వరకూ సినిమా ఉంటుందా ఊడుతుండా అనేది కీలకం. ఎప్పుడూ టాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ లు మంగళవారాన్ని చాలా ఆసక్తిగా గమనిస్తారు. సోమవారం తేడా కొట్టినా మంగళవారం నాడు సినిమా కాస్తంత అందుకుంటే వారాంతం లో అదిరిపోతుంది అని వారి లెక్క.

 

మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఐదున్నర కోట్లకి అమ్మేసారు అంటే రికవరీ యావరేజ్ గా ఉంటుంది అంటున్నారు ఎనలిస్ట్ లు, లాసేస్ వచ్చినీ తీవ్రమైన లాస్ లు రావు అనీ పబ్లిసిటీ ఇంకా గట్టిగానే సాగుతోంది అనీ చెబుతున్నారు. సినిమా మేకింగ్ కి మూడు కోట్ల వరకూ దాటిందట. పారితోషికాలతో కలిపి మొత్తం ఐదు దాకా అయ్యిందట. శాటిలైట్ మీద కూడా ఇంకా డబ్బు రావాల్సి ఉంది. ఇంకా అది అమ్మనే లేదు.  నెగిటివ్ సమీక్షలు వచ్చిన నేపథ్యంలో శాటిలైట్  రేటు ఏ మేరకు తగ్గుతుందన్నది చూడాలి. అలా శాటిలైట్ మీద వచ్చిందే ఆ నలుగురు నిర్మాతలకు మిగిలేది..లేదూ అంటే తొమ్మిది నెలల కష్టం వృధా అయిపోతుతుంది.ఏదేమైనా నిహారిక జీవితం లో మొట్ట మొదటి సినిమా కాబట్టి ఈ మంగళవారం అంటే ఇవాళ ఆమెకి చాలా కీలకం అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: