విక్టరీ వెంకటేష్ మారుతి దర్శకత్వంలో వస్తున్న సినిమా బాబు బంగారం.. వెంకీ మార్క్ కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. జూలై 4 నుంద్ 8 వరకు జరిగే పాట షూట్ తో సినిమా మొత్తం కంప్లీట్ అవుతుందట. ఇక సినిమాను కూడా జూలై మూడు నాలుగు వారాల్లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 


మారుతి సినిమా అంటే అందులో కామెడీ పుష్కలంగా ఉంటుంది. అయితే మారుతికి వెంకటేష్ తోడైన ఈ బాబు బంగారం సిని ప్రియులకు మంచి ఎంటర్టైన్ ఇస్తుంది అనడంలో సందేహం లేదు. రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక చివరి దశకు చేరుకున్న సినిమా బిజినెస్ కూడా మంచి మార్కెట్ తో నడుస్తుందట. జూలై 9న ఆడియో వేడుక జరుపుకోనున్న ఈ సినిమా అదే నెల 29న రిలీజ్ చేయాలని చూస్తున్నారు.


భలే భలే మగాడివోయ్ తో మంచి హిట్ అందుకున్న మారుతి ఈ సినిమాతో మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకోనున్నాడు. గోపాలా గోపాలా తర్వాత వెంకీ కాస్త లేట్ చేసినా ఫ్యాన్స్ కు మంచి ఎంటర్టైన్ ఇచ్చే దిశగా బాబు బంగారంతో వస్తున్నాడు. మరి చెన్నైలో ముగింపు కార్యక్రమాలను చేసుకుంటున్న చిత్రయూనిట్ అనుకున్నట్టుగా పూర్తి చేయాలని చూస్తుంది.


గిబ్రాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా చ్స్తుంది. వెంకీ నయన్ ఇద్దరు ఇప్పటికే లక్ష్మి, తులసి సినిమాల్లో నటించి హిట్ అందుకున్నారు. వీరి కాంబినేషన్లో వస్తున్న ఈ మూడో సినిమా హ్యాట్రిక్ హిట్ ఇస్తుందో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: