బాలీవుడ్ లో ప్రస్తుతం నెంబర్ వన్ హీరోయిన్ రేసు లో ఉన్న వారిలో దీపికా పదుకొణె ఒకరు. ఈ అమ్మడు వాస్తవానికి కన్నడ నటి అయినా అక్కడ రాని గుర్తింపు బాలీవుడ్ లో రావడం అక్కడ నుంచి హాలీవుడ్ లో కూడా చాన్స్ రావడం అనేది చాలా కొద్దిమందిని వరించే అదృష్టమనే చెప్పాలి. అయితే దీపికా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టి పదకొండు సంవత్సరాలు అయ్యిందని ఇప్పటి వరకు ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నానని కానీ ఐఫా వేడుకల్లో 'పీకు' చిత్రానికి వచ్చిన అవార్డు చాలా గొప్పదని భావిస్తున్నానని అన్నారు. ఈ చిత్రంలో గొప్ప గొప్ప నటులు ఉన్నా కూడా తన నటనను మెచ్చుకొని అవార్డు ఇవ్వడం అనేది నా కష్టానికి సంపూర్ణంగా ఫలితం దక్కిందని భావిస్తున్నట్లు తెలిపింది.  

తాజాగా ఐఫా వేడుకల్లో 'పీకు' చిత్రానికి గానూ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న ఈ అమ్మడు అవార్డులు.. సినిమా కోసం నటులు పడే కష్టానికి నిదర్శనంగా నిలుస్తాయని చెబుతోంది. ఇక చారిత్రక చిత్రం బాజీరావ్ మస్తానికి చిత్రానికి వచ్చిన అవార్డు గురించి ప్రస్తావిస్తూ ఇలాంటి చిత్రం తనకు రావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నట్లు..ఈ సినిమా ఎలాంటి ప్రేక్షకులనైనా చూస్తున్నంత సేపు తల పక్కకు తిప్పుకోలేని విధంగా చేస్తుంది అన్నారు. ఇక సినిమా ఇండస్టీ అంటే నటులకు వృత్తిపై ఎంతో ప్రేమ ఉంటేనే తెరపై మెప్పించగలరు. అందుకే అవార్డులు సినిమాలో నటుడి కష్టానికి నిదర్శనంగా నిలుస్తాయి'' అని చెప్పింది.  

ఇక హాలీవుడ్ లో చాన్స్ రావడం అనేది కూడా చాలా అదృష్టమని అయితే ఇప్పటికే తన సహనటులు కొంతమంది హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారని తన కూడా ఓ మంచి సినిమాలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. విన్‌డీజిల్‌ సరసన నటించటం అంటే చాలా దగ్గర వ్యక్తులతో నటిస్తున్నట్లు అనిపిస్తుందని అంతే కాదు అక్కడి పరిసరాలు..వ్యక్తుల కొత్తలా కాస్త ఇబ్బందిగా ఉన్నా ఆయన ప్రతీక్షణం నా పక్కనే ఉంటూ అన్నింటినీ సులువుగా మార్చేశారని తెగ పొగిడేస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: