దర్శకుడు రాజమౌళి  తీసిన 'బాహుబలి' మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళంలో సంచలనాలు క్రియేట్  చేసిన తరువాత ఈ సినిమాను ప్రపచంలోని  వివిధ  భాషలలో డబ్ చేసి విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ సినిమాను చైనీ భాషలోకి డబ్ చేసి వచ్చే నెల జూలై లో విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఒక బాలీవుడ్  మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి బాలీవుడ్ స్టార్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసాడు.   

ఈ సందర్భంలో ఆమీడియా సంస్థ  ప్రతినిధి  బాలీవుడ్, టాలీవుడ్,  కోలీవుడ్ కలిపి 'బాహుబలి'  600 కోట్లు వసూలు చేసిన సందర్భాన్ని గుర్తుకు చేస్తూ బాలీవుడ్ స్టార్లు లేక పోయినా ఈ సినిమా హిందీలో భారీ వసూళ్లు సాధించింది అన్న విషయాన్ని అంగీకరిస్తూ  అదే బాలీవుడ్ స్టార్లతో ఈ సినిమా చేసి ఉంటే ఓవరాల్ గా ఈ సినిమా వసూళ్లు వెయ్యి కోట్లు దాటేవి కదా ? అని ఆ మీడియా సంస్థ ప్రతినిధి రాజమౌళిని ఇరుకున పెట్టడానికి ప్రయత్నించాడు.  

దానికి రాజమౌళి ఏమాత్రం తడబడకుండా  బాహుబలి లో  నటించే స్టార్స్  కనీసం రెండేళ్లు డేట్స్ ఇవ్వడం అవసరం అని అంటూ అలాంటి సహకారం బాలీవుడ్ స్టార్స్ ఇవ్వరు అని అంటూ ఎవరైనా ఎలాంటి కమిట్మెంట్స్ లేకుండా రెండేళ్లు డేట్స్ ఇవ్వగలరా ? అంటూ బాలీవుడ్ స్టార్స్ పై సంచలన వ్యాఖ్యలు  చేసాడు. ఇది ఇలా ఉండగా  'బాహుబలి' ఇప్పటి దాకా చైనాలో ఏ ఇండియన్ మూవీ రిలీజ్ కాని స్థాయిలో ఏకంగా 6 వేలకు పైగా థియేటర్లలో ‘బాహుబలి ది బిగినింగ్’ విడుదల కాబోతు ఉండటం సంచలనంగా మారింది.

ఈ సినిమాకు సంబంధించి చైనాలో ప్రమోషన్లు  పెద్ద ఎత్తున చేసిన నేపథ్యంలో చైనాలో ‘బాహుబలి’ కి వంద కోట్లకు తక్కువ కాకుండా కలెక్షన్స్ వస్తాయని ఆశిస్తున్నారు. మరొక  షాకింగ్ న్యూస్ ఏమిటంటే ఇండియాలో కంటే ఎక్కువగా చైనాలో ఈ చిత్రాన్ని విడుదల  చేయడం సంచలనంగా మారింది. తెలుస్తున్న సమాచార్తం మేరకు చైనా వ్యాప్తంగా 6500 స్క్రీన్స్ లో బాహుబలిని విడుదల చేస్తున్నారు. చైనాలో కూడ బాహుబలి 100 కోట్ల కలెక్షన్స్ రాబట్ట   గలిగేతే 'బాహుబలి 2'  క్రేజ్ మరింత పెరిగి పోవడం ఖాయం..  


మరింత సమాచారం తెలుసుకోండి: