100 కోట్ల కలెక్షన్స్ టార్గెట్ గా శరవేగంగా నిర్మాణం జరుపుకుంటున్న‘జనతా గ్యారేజ్’ షూటింగ్ సారధి స్టూడియోలో ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఈసినిమా ట్యాగ్ గా అన్నిరకాల వెహికల్స్‌కు రిపేర్లు చేయబడును అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చేశారు. 

అయితే ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి ఈమధ్య విడుదలైన వర్కింగ్ స్టిల్స్ లో ‘జనతా గ్యారేజ్’ సెట్ ఎదురుగుండా గులాబీ కారు ఆగి ఉండటం అనేక సెటైర్లకు దారితీస్తోంది. ఈ సినిమాలోని ఒక సన్నివేశానికి అనుగుణంగా ఈ గులాబి రంగు కారును ఈ సినిమా సెట్ లోకి తీసుకు వచ్చారా ? లేదంటే ఈ గులాబి రంగు కారులో ఎవరైనా జూనియర్ ను కలవాడానికి వచ్చారా ? అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. 

మరి కొందరైతే ఈమధ్య కాలంలో జూనియర్ కు తెలుగు దేశం పార్టీకి పూర్తిగా దూరం పేరిన నేపధ్యంలో చాలామంది తెలంగాణ తెలుగుదేశం నాయకులు లాగే జూనియర్ కూడ గులాబి పార్టీ వైపు చూస్తున్నాడా ? అంటూ మరికొందరు జూనియర్ పై సెటైర్లు వేస్తూ పోస్టింగ్స్ పెడుతున్నారు. అయితే జూనియర్ అభిమానులు మాత్రం ఈ వార్తలను ఖండిస్తూ ఈ సినిమాలోని సన్నివేశానికి తగ్గట్టుగా ఆ గులాబి కారును పెట్టి ఉంటారని అంటున్నారు. 

ఈ వార్తలు ఇలా ఉండగా ‘జనతా గ్యారేజ్’ ఆడియో ఫంక్షన్ ఖమ్మంలో వచ్చేనెల జరగబోతోంది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఈ వార్తల నడుమ ఇప్పుడు ఈ గులాబి కారు హంగామా మరోసారి జూనియర్ పై అనుమాలను రేకెత్తిస్తోంది..



మరింత సమాచారం తెలుసుకోండి: