వరస విజయాలతో దూసుకు పోతున్న నాని ‘జెంటిల్ మన్’ హిట్ తో మంచి జోష్ మీద ఉన్నాడు. నాని రేంజ్ పెరిగి పోయి ఆడియో ఫంక్షన్స్ కు అతిధిగా కూడ పిలిచేస్తున్నారు. ఈ నేపధ్యంలో నాని నటించ బోతున్న లేటెస్ట్ సినిమాల పై కూడ మంచి క్రేజ్ పెరిగి పోతోంది. 
 
ఇది ఇలా ఉండగా నాని లేటెస్ట్ సినిమాకు సంబంధించిన ఒక న్యూస్ అయితే ఇప్పుడు నాగార్జునకు షాకింగ్ న్యూస్ గా మారింది అని టాక్. నాగచైతన్య చేయలేని సాహసం ఇప్పుడు నానీ చేయబోతూ ఉండటం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.

ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం నాని - విరించి వర్మ కలయికలోత్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతున్న సినిమాకు ‘మజ్ను’ అన్న టైటిల్ ను నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. లవ్ స్టోరీ నేపధ్యంలో నడిచే ఈకథకు అన్ని విధాలా ‘మజ్ను’టైటిల్ బాగుటుంది అని దర్శకుడు విరంచి వర్మ సూచించడంతో హీరో నాని కూడ ఈ సూచనను అంగీకరించినట్లు టాక్.

అయితే ఈ విషయoలో ఒక ట్విస్ట్ ఉంది. చందూ మొందేటి – నాగచైతన్యల కాంబినేషన్ లో వస్తున్న ‘ప్రేమమ్’ సినిమాకు ముందుగా ‘మజ్ను’ అన్న టైటిల్ పెడదామని భావించారు. అయితే ఆ టైటిల్ పై నాగచైతన్య పెద్దగా ఇష్టపడక పోవడంతో  మలయాళ చిత్రం ‘ప్రేమమ్’ టైటిల్ నే తెలుగు వెర్షన్ కు కూడ కోనసాగిస్తున్నారు. అయితే చైతూ చేయలేని సాహసం నాని చేయడం నాగార్జునకు షాకింగ్ గా మారింది అని అంటున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: