ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో దర్శకుల కంటే రచయితల హడావిడే ఎక్కువుగా కనిపిస్తుంది. ఒరిజినల్ డైరెక్టర్స్ కి కథలు రాసుకోవటం రాదు, అలాగే ఇతర కథలను సైతం సరిగా తెరకెక్కించలేరు. ఇతర రచయితల కథలను సరిగా వాడుకోవటం తెలిసివ దర్శకులు ఇండస్ట్రీలో చాలా తక్కువ మందే ఉన్నారు.


అయితే మిగిలిన వారి పరిస్థితి ఏమిటి? ఏముంది చాలా సింపుల్. రచయితలు మంచి కథలు ఇస్తేనే వారి సినిమా హిట్టవుతుంది. లేదంటే ప్లాపవుతుంది. ఈ విషయం తెలుసుకున్న రచయితలు వారే డైరెక్టర్స్ గా అవతారం ఎత్తటానికి రెడీ అవుతున్నారు. ఆ విధంగా వచ్చిన వారేత్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ వంటి వారు. వీరి కథలను వాడుకుంటున్న దర్శకులు వీరికి సరైన గుర్తింపు ఇవ్వకపోవటంతో...ఇండస్ట్రీలో వీరు దర్శకులుగా మారారు.


ఇప్పుడు వీరిని చూసి మరికొంత మంది దర్శకులుగా వస్తున్నారు కూడ. అలాంటి వారిలో తాజాగా 'బాడీగార్డ్', 'పండగ చేస్కో' వంటి పలు చిత్రాలకు రచయితగా పనిచేనసిన వెలిగొండ శ్రీనివాస్ దర్శకుడిగా మారనున్నారు. తర్వలోనే ఇతను రాజ్ తరుణ్ హీరోగా రూపొందే చిత్రంకి దర్శకుడిగా పనిచేయనున్నారు.


ఈ మూవీని ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర నిర్మిస్తారు. అయితే రాజ్ తరుణ్ తోనే కాకుండా మరో టాప్ హీరో మూవీకి సైతం వెలిగొండ శ్రీనివాస్ దర్శకుడిగా పనిచేయనున్నారు. ఈ మధ్య కాలంలో ఓ టాప్ హీరోవద్దకి సినిమా కోసం వచ్చిన కొరటాల శివకి, ఆ హీరో వెలగొండ శ్రీనివాస్ మూవీకి కమిట్ అయ్యాడని చెప్పటంతో...కొరటాల ఒక్కసారిగా షాక్ అయ్యాడని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: