తమిళంలో విలక్షణ నటుడిగా పేరు ప్రఖ్యాతలున్న వ్యక్తుల్లో సూర్య ఒకరు. రీసెంట్ గా సూర్య 24తో మరో మెట్టు ఎకాడని చెప్పాలి. అయితే తెలుగులో కూడా అలాంటి హీరో శర్వానంద్ ఆలోచనలు సూర్యకు నిద్రపట్టకుండా చేస్తున్నాయి. ప్రస్థానం సినిమాతో తనలోని విలక్షణ కోణాన్ని బయట పెట్టి సినిమా సినిమాకు తనలోని విలక్షణతతో అదరగొడుతున్నాడు శర్వానంద్. 


కెరియర్ మొదలు పెట్టిన పది సంవత్సరాల్లో 24 సినిమాలు నటించిన శర్వానంద్.. తన 25వ సినిమాగా ఓ పోలీస్ పాత్రలో సినిమా చేస్తున్నాడు. అయితే సూర్య కూడా తన పాతికో సినిమా సింగం మొదలు పెట్టాడు అంటే సూర్య రేంజ్ కాకపోయినా శర్వానంద్ సూర్యకు పోటీ ఇచ్చేలా చూస్తున్నాడు. అంతేకాదు సింగం-3 గా రాబోతున్న సూర్య సినిమాకు పోటీగా తన సినిమా కూడా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నడట శర్వానంద్.


చంద్ర మోహన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మిస్తుంది. ఈ సంవత్సరం మొదట్లోనే పెద్ద సినిమాలతో ఎక్స్ ప్రెస్ రాజా అంటూ వచ్చి వాటి కన్నా పెద్ద విజయం దక్కించుకున్న శర్వానంద్ ఇక నుంది అదే హిట్ జోష్ ను కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు. రన్ రాజా రన్ నుండి హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న శర్వా ఈ పోలీస్ సినిమాతో కూడా మరో హ్యాట్రిక్ కు ముహుర్తం పెడుతున్నాడు.  


ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి మిగతా డీటేల్స్ త్వరలో తెలుస్తాయి. మరి సూర్యతో పోటీ పడేంత క్రేజ్ ఉన్నా లేకున్నా శర్వా చేస్తున్న ఈ ప్రయత్నాన్ని కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. సూర్య సింగం సక్సెస్ కొట్టి సీక్వల్స్ తీస్తున్నట్టుగా శర్వానంద్ కూడా చేస్తున్న సినిమా సీక్వల్స్ చేసేలా హిట్ కొట్టాలని కోరుకుందాం.  



మరింత సమాచారం తెలుసుకోండి: