బుల్లితెరపై టాప్ పొజీషన్లో యాంకర్ ఎవరంటే వెంటనే సుమ కనకాల గురించి చెబుతారు.  చలాకీ మాటలతో ముఖంపై ఎప్పుడూ చిరునవ్వుతో చాలా ట్రెడిషనల్ గా కనిపిస్తూ యాంకరింగ్ చేసే సుమ అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల వరకు తెలుగు ప్రేక్షకులందరికీ చాలా ఇష్టం. ఇక ఈ మద్య ప్రతి ఆడియో ఫంక్షన్లు, అవార్డు వేడుకలకు సుమా లేనిదే జరగదేమో అన్నంత పరిస్థితికి వచ్చింది. అద్భుతమైన వాక్ఛాతర్యంతో ఎదుటి వారిని ఇట్టే కట్టిపడేసే మాటలతో సుమా కనకాల బుల్లితెర తెలుగు ప్రేక్షకులను అలరిస్తుంది. అయితే సుమ కేరళకు చెందిన అమ్మాయే అయినా తెలుగు భాషపై అద్భుతమైన పట్టు సాధించింది.  సుమ..రాజీవ్ కి గుడ్ బై చెప్పేసిందట ఆ....అది ఇప్పుడు కాదండి బాబూ..సుమ, రాజీవ్ కనకాల ప్రేమించి పెళ్లిచేసుకున్న విషయం తెలిసిందే.

అయితే అప్పట్లో ఓ టీవి చానల్ లో ఇద్దరు కలిసి పనిచేసే సమయంలో సుమని ఇష్టపడ్డ రాజీవ్ మొదట తన ప్రపోజల్ తెలిపాడట. ఆ ప్రపోజల్ కి చాలా టైమ్ తీసుకొని ఓకే చెప్పిందట..ఆ సమయంలో సుమ సినిమాల్లో కూడా నటిస్తుందట. అయితే ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్న సమయంలో రాజీవ్ ఓ కండీషన్ పెట్టడాట..పెళ్లి అయిన తర్వాత సినిమాల్లో నటించకూడదని.

దాంతో పెళ్లికి ముందే ఇన్ని కండీషన్లయితే..తర్వాత పరిస్థితి ఏంటా అని ఇలా అయితే కష్టమని రాజీవ్ కి గుడ్ బై చెప్పేసిందట. అంతే కాదు వారిద్దరు రెండు సంవత్సరాల వరకు మాట్లాడుకోలేదట. ఆ తర్వాత సుమ సినిమాల్లో చేయడం మానేసిందట. తర్వాత రాజీవ్ ని కలవడం..తిరిగి వారి మద్యప్రేమ చిగురించడం పెళ్లి చేసుకోవడం అయ్యిందట. ఈ విషయాన్ని సుమ ఓ ఇంటర్వ్యూలో నవ్వుతూ చెప్పింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: