సూపర్ స్టార్ రజినికాంత్ నటించిన కబాలి సినిమా జూలై 15 రిలీజ్ అని అందరు ఫిక్స్ అయ్యారు. ఎన్నోసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్ అవుతున్నందుకు ఫ్యాన్స్ కూడా సంబరాలు చేసుకున్నారు. అయితే అనుకున్నట్టుగా కబాలి జూలై 15న రిలీజ్ అవడం ఖాయం అనుకుంటున్న ఈ సమయంలో కబాలి మళ్లీ వాయిదా పడనున్నట్టు ఎక్స్ క్లూజివ్ న్యూస్ అందింది.


కారణాలేంటి మరళ కబాలి ఎందుకు పోస్ట్ పోన్ అవుతుంది అన్న వాటి మీద ఇంకా సరైన సమాచారం అందలేదు కాని మరో వారం పాటు కబాలి వాయిదా పడనుంది అని కోలీవుడ్ మీడియాలో రూమర్లు వస్తున్నాయి. అసలైతే ఎప్పుడో ఏప్రిల్ లో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా మే, జూన్ అంటూ ఊరిచ్చి జూలైలో ఫిక్స్ చేశారు.


కబాలి వస్తున్నాడు అని తెలిసి చిన్న సినిమాల నిర్మాతలు తమ సినిమాలను ముందుకు వెనక్కి మార్చుకున్నారు. మరి ఈ వాయిదాతో మళ్లే సినిమాలు కబాలి దాటికి బలవుతాయో చూడాలి. తెలుస్తున్న సమాచారం ప్రకారం కబాలి జూలై 22న రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. మరి జూలై 15న సినిమా చూద్దామనుకున్న ప్రేక్షకులకు ఈ న్యూస్ పెద్ద షాక్ అనే చెప్పాలి.  


పా.రంజిత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను వి క్రియేషన్స్ బ్యానర్లో కళైపుళి ఎస్ థను నిర్మిస్తున్నారు. రాధికా ఆప్టె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు. రీసెంట్ గా తెలుగులో రిలీజ్ అయిన కబాలి ఆడియో శ్రోతలను ఎంతగానో అలరిస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: